Sirivennela Seetharama Sastry : ఆ పాట రాయడం కోసం సీతారామ శాస్త్రిని మొదటిసారి పబ్‌కి తీసుకెళ్లిన దర్శకుడు..

ఇటీవల సిరివెన్నెల సీతారామశాస్త్రిని స్మరిస్తూ నా ఉఛ్వాసం కవనం అనే ఓ ఇంటర్వ్యూ సిరీస్ ని నిర్వహించారు.

Sirivennela Seetharama Sastry : ఆ పాట రాయడం కోసం సీతారామ శాస్త్రిని మొదటిసారి పబ్‌కి తీసుకెళ్లిన దర్శకుడు..

Sirivennela Seetharama Sastry went to pub first time for writing that song

Updated On : July 23, 2024 / 7:54 AM IST

Sirivennela Seetharama Sastry : ఎన్నో అర్థవంతమైన పాటలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన లేకపోయినా ఆయన పాటలు, ఆ పాటల భావాలు ఇప్పటికి మనల్ని వెంటాడుతాయి. ఇటీవల సిరివెన్నెల సీతారామశాస్త్రిని స్మరిస్తూ నా ఉఛ్వాసం కవనం అనే ఓ ఇంటర్వ్యూ సిరీస్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు వచ్చి సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు.

తాజాగా ఈ నా ఉఛ్వాసం కవనం ఇంటర్వ్యూకి దర్శకుడు కృష్ణవంశీ వచ్చారు. కృష్ణవంశీకి, సిరివెన్నెల సీతారామశాస్త్రికి మంచి అనుబంధం ఉంది. కృష్ణవంశీ సినిమాలకు ఆల్మోస్ట్ చాలా పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసారు. కృష్ణవంశీ గొప్ప సినిమాల్లో ఖడ్గం ఒకటి. ఈ సినిమాలో మనసు వేయొద్దు ముసుగు మీద.. సాంగ్ రాసినప్పుడు జరిగిన ఆసక్తికర విషయాన్ని ఇంటర్వ్యూలో తెలిపారు.

Also Read : Rajamouli – RGV : రాజమౌళిని ఓ రేంజ్‌లో పొగిడిన ఆర్జీవీ.. బాహుబలి కథ నాకు చెప్పాడు.. ఈ సక్సెస్ తెలుగు సినిమాది కాదు..

కృష్ణవంశీ మాట్లాడుతూ.. ఖడ్గం సినిమా ఒక ఎమోషన్. అందులో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. ఈ సినిమాలో ముసుగు వెయ్యొద్దు మనసు మీద సాంగ్ పబ్ లాంటి ప్లేస్ లో ఉంటుంది. అలాగే ఆ పాట పబ్ సాంగ్ లా ఉన్నా ఆ లిరిక్స్ చూస్తే చాలా స్ఫూర్తినిచ్చే సాంగ్ లా ఉంటుంది. ఈ సాంగ్ రాయమని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని అడిగినప్పుడు నాకు పబ్ లో ఎలా ఉంటుందో తెలియదు, అందుకే రాయడం కష్టమవుతుంది అన్నారు. దీంతో మొదటిసారి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని పబ్ కి తీసుకెళ్ళాను. అక్కడి వాతావరణాన్ని గమనించి ముసుగు వెయ్యొద్దు మనసు మీద..అనే గొప్ప సాంగ్ రాసిచ్చారు. ఆ పాటతో యూత్ కి ఫిలాసఫీ చెప్పారు అని తెలిపారు.