Actor Uttej: ఇలా వదిలేశావ్ ఏంటమ్మా.. కంట తడి పెట్టిస్తున్న ఉత్తేజ్ కూతురు పోస్ట్!

ప్రముఖ సినీనటుడు, రచయిత ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఉత్తేజ్ సతీమణి పద్మావతి క్యాన్సర్‌తో పోరాడుతూ హైదరాబాద్ బసవతారకం ఆస్పత్రిలో కన్నుమూశారు. ఉత్తేజ్ కూతురు పాట..

Actor Uttej: ప్రముఖ సినీనటుడు, రచయిత ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఉత్తేజ్ సతీమణి పద్మావతి క్యాన్సర్‌తో పోరాడుతూ హైదరాబాద్ బసవతారకం ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌ చికిత్స పొందుతున్న ఆమె సోమవారం ఉదయం ఎనిమిదన్నర గంటలకు తుదిశ్వాస విడవగా.. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్ సహా ఇద్దరు కుమార్తెలు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Prakash Raj: జేసీబీ గిఫ్ట్.. పేదకుటుంబానికి అండగా విలక్షణ నటుడు!

ఉత్తేజ్‌కు సతీవియోగంతో సినీ ప్రముఖులు ఆయన్ను ఓదార్చారు. మెగాస్టార్ చిరంజీవి బసవతారకం ఆస్పత్రికి చేరుకొని ఉత్తేజ్ కుమార్తెలను ఓదార్చగా.. ఉత్తేజ్ తన భార్యను తలుచుకుంటూ గుండెలవిసేలా రోధించారు. ప్రముఖ గేయ రచయిత, ఉత్తేజ్ మేనమామ సుద్దాల అశోక్ తేజతోపాటు, జీవిత రాజశేఖర్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మాజి, ఏడిద శ్రీరామ్ సహా పలువురు నటీనటులు ఉత్తేజ్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో ఉత్తేజ్ తన సతీమణి పద్మావతికి అంత్యక్రియలు పూర్తి చేశారు.

Telugu Films Shooting: ఏ సినిమా ఏ దశ షూటింగ్‌లో ఉందంటే?

సినీ ప్రముఖులు ఉత్తేజ్ కుటుంబాన్ని పరామర్శించే సమయంలో ఉత్తేజ్ కూతురు పాట ఉత్తేజ్ విలపించిన తీరు అందరిని కలచివేసింది. అమ్మను తలుచుకుంటూ పాట ఉత్తేజ్ ఎమోషనల్ కాగా తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ అందరినీ కదిలిస్తుంది. అమ్మా.. లవ్యూ సో మచ్.. అమ్మా.. నిన్ను ఇకపై మిస్ అవుతాను.. ఇంత త్వరగా నన్ను, అక్క, డాడీని వదిలి వెళ్లావ్.. లవ్యూ అమ్మా.. నా భవిష్యత్తు ని ఇలా వదిలేశావ్ ఏంటి అమ్మా.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.. నువ్ మళ్లీ అక్క కడుపులోంచి వస్తావ్ అని నాకు తెలుసు అమ్మా.. అని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఎమోజీలను షేర్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు