Sundeep Kishan Project Z Movie Streaming in Aha OTT getting good Views
Project Z : తమిళ్ లో థ్రిల్లింగ్ సినిమాలు తీసే డైరెక్టర్ CV కుమార్ 2017 లో సందీప్ కిషన్(Sundeep Kishan) హీరోగా ఎస్‌బికె ఫిలింస్ కార్పోరేషన్‌లో ఎస్.కె.బషీద్ నిర్మాణంలో మాయావన్ అనే సినిమా తీశారు. ఈ సినిమాని తెలుగులో ప్రాజెక్ట్ Z గా రిలీజ్ చేశారు. ఈ సినిమా థియేటర్స్ లో కమర్షియల్ గా అంత సక్సెస్ అవ్వకపోయినా మంచి పేరు వచ్చింది. లావణ్య త్రిపాఠి ఇందులో హీరోయిన్ గా నటించగా జాకీ ష్రాఫ్, పలువురు తమిళ్ నటులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఇటీవలే మాయావన్ సినిమాకు సీక్వెల్ కూడా అనౌన్స్ చేసి అదే దర్శకుడు CV కుమార్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా అనిల్ సుంకర నిర్మాతగా AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే ప్రాజెక్టు Z సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది.
Also Read : Gangs of Godavari : ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ రివ్యూ.. విశ్వక్ సేన్ ఊర మాస్ పర్ఫార్మెన్స్..
మన తెలుగు ఓటీటీ ఆహాలో ‘ప్రాజెక్ట్ Z’ సినిమా నిన్న మే 31 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఆహాలో రిలీజయిన 24 గంటల్లోనే మంచి వ్యూస్ దక్కించుకొని దూసుకుపోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్ళు థియేటర్స్ లో ఈ ప్రాజెక్టు Z సినిమాని మిస్ అయినా వాళ్ళు ఆహా ఓటీటీలో చూసేయండి. సందీప్ కిషన్ ఇందులో పోలీసాఫీసర్ గా నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఆహా ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది ప్రాజెక్ట్ Z సినిమా.