Gangs of Godavari : ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ రివ్యూ.. విశ్వక్ సేన్ ఊర మాస్ పర్ఫార్మెన్స్..

విశ్వక్ పర్ఫామెన్స్ కెరీర్ బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. యాక్షన్ సీక్వెన్స్ లో మాత్రం అదరగొట్టేశాడు.

Gangs of Godavari : ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ రివ్యూ.. విశ్వక్ సేన్ ఊర మాస్ పర్ఫార్మెన్స్..

Vishwak Sen Neha Shetty Anjali Gangs of Godavari Movie Review and Rating

Gangs of Godavari Movie Review : విశ్వక్‌ సేన్(Vishwak Sen), నేహశెట్టి (Neha Shetty) జంటగా, అంజలి (Anjali) ముఖ్య పాత్రలో కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా తెరకెక్కిన ఈ సినిమా నేడు మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు.

కథ విషయానికొస్తే.. రాజమండ్రి కొవ్వూరు మధ్యలో ఉన్న ఓ గోదావరి లంకలో జరుగుతుంది. లంకలో పుట్టిన రత్న (విశ్వక్ సేన్) చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అనుకోకుండా ఓ కంపెనీ డీలర్ అవుతాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే దొరస్వామి(గోపరాజు రమణ) దగ్గర చేరి ఇసుక ర్యాంపులు చూస్తాడు. రాజకీయాల్లోకి వెళ్ళాలనుకొని దొరస్వామి ప్రత్యర్థి నానాజీ (నాజర్) తో చేతులు కలిపి ఎమ్మేల్యే అయిపోతాడు. అలాగే నానాజీ కూతురు బుజ్జి(నేహా శెట్టి) రత్న ప్రేమలో పడటంతో నానాజీకి కూడా శత్రువు అవుతాడు. నానాజీ, దొరస్వామి రత్నని దెబ్బతీయాలని చూస్తారు. రత్న వెంట ఉన్న మనుషులు కూడా అతనిని చంపడానికి కత్తి కడతారు. వాళ్ళు ఎందుకు రత్నకు వ్యతిరేకంగా మారతారు? నానాజీ, దొరస్వామి రత్నని ఏం చేశారు? రత్నమాల(అంజలి) ఎవరు? ఆమెకు, రత్నకు సంబంధం ఏంటి? రత్న లైఫ్ లోకి బుజ్జి వచ్చిందా? రత్న తండ్రి ఎవరు? రత్న అందర్నీ ఎదురించి ఎలా నిలబడ్డాడు? ఈ కత్తి కట్టడం అంటే ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

సినిమా విశ్లేషణ.. ఒక సాధారణ వ్యక్తి అంచలంచెలుగా ఎదుగుతూ పైకి వెళ్లే సినిమాలు చాలానే వచ్చాయి. ఇది కూడా ఆ కోవలోనే ఉంటుంది. అయితే గోదావరి చుట్టూ ఈ కథని అల్లుకున్నారు. హీరో క్యారక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైమ్ ఎక్కువే తీసుకున్నారు. గోదావరి అంటే నది, పచ్చని పొలాలు అని ఇప్పటివరకు సినిమాల్లో చూపించారు. కాని ఈ సినిమాలో దానికి భిన్నంగా పగలు, ప్రతీకారాలు చూపించారు. యాక్షన్ సీక్వెన్స్ కొత్తగా ప్లాన్ చేశారు. కత్తి కట్టడం అనే దాన్ని ఆసక్తికరంగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా రత్న గురించి, ప్రేమ, పెళ్లి, రత్న ఎదుగుదల చూపించి ఇంటర్వెల్ నుంచి అసలు కథ మొదలుపెట్టారు. క్లైమాక్స్ ఊహించని ట్విస్ట్ ఇస్తారు. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చేలా సినిమాని ముగించారు.

Also Read : Gam Gam Ganesha : ‘గం గం గణేశా’ మూవీ రివ్యూ.. ‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ మళ్ళీ హిట్ కొట్టాడా?

నటీనటుల పర్ఫార్మెన్స్.. విశ్వక్ పర్ఫామెన్స్ కెరీర్ బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. యాక్షన్ సీక్వెన్స్ లో మాత్రం అదరగొట్టేశాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. నేహాకి మంచి పాత్రే పడినా నిడివి తక్కువ ఉంది. అందంతో కూడా మెప్పించింది నేహా. అంజలికి యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర పడటంతో నటనతో మెప్పించింది. ఎప్పట్లాగే గోపరాజు రమణ తన యాక్టింగ్ తో మెప్పించాడు. నాజర్, హైపర్ ఆది, పమ్మి సాయి.. మిగిలిన నటీనటులు పర్వలేదనిపించారు. ఐటెం సాంగ్ లో అయేషా ఖాన్ అదరగొట్టేసింది.

సాంకేతిక అంశాలు.. ఇప్పటివరకు ఎక్కువగా మెలోడీ మ్యూజిక్ ఇచ్చిన యువన్ శంకర్ ఈ సినిమాకి అదిరిపోయే రా అండ్ రస్టిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. సాంగ్స్ కూడా బాగున్నాయి. కథ పాతదే అయినా స్క్రీన్ ప్లే కొత్తగా ట్రై చేశారు కానీ ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. దర్శకుడు కృష్ణ చైతన్య త్రివిక్రమ్ శిష్యుడు. సినిమాలోని డైలాగ్స్ లో ఆ ప్రభావం కనిపిస్తుంది. దర్శకుడిగా కృష్ణ చైతన్య సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సినిమటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి కానీ కొన్ని చోట్ల పీరియాడిక్ లుక్స్ మిస్ అయ్యాయి అనిపిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు బాగుంటాయని తెలిసిందే. సినిమాకు చాలానే ఖర్చుపెట్టరని తెరపై తెలుస్తుంది.

మొత్తంగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా లంకల రత్న జీవితంలో ఎన్ని మలుపులు ఉన్నాయి అని యాక్షన్ తో చెప్పారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.