Chinmayi Sripada: వైరముత్తుకు ‘జ్ఞాన’ గౌరవం.. చిన్మయి సంచలన కామెంట్స్.. కమల్ హాసన్ ను కూడా వదలలేదు
రచయిత వైరముత్తుకు జ్ఞానపీట్ పురస్కారం ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్మయి శ్రీపాద(Chinmayi Sripada).
Chinmayi expresses outrage over announcing Jnanpith Award for writer Vairamuthu.
- రచయిత వైరముత్తుకు జ్ఞానపీట్ పురస్కారం
- మండిపడ్డ సింగర్ చిన్మయి
- వేధింపులు ఎదుర్కొన్న వ్యక్తికి అగ్రతాంబూలం అంటూ ఆగ్రహం
Chinmayi Sripada: భారతీయ సాహిత్యంలో అత్యున్నత శిఖరంగా భావించే జ్ఞానపీఠ్ పురస్కారం దశాబ్దాల తర్వాత ఒక తమిళ సాహితీవేత్తను వరించడం తమిళనాట ఒక చారిత్రాత్మక ఘట్టం. అయితే, ప్రముఖ కవి వైరముత్తుకు ఈ గౌరవం ప్రకటించిన క్షణం నుంచే అభినందనలను మించి వివాదాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2018లో దేశాన్ని కుదిపేసిన #MeToo ఉద్యమం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
రచయిత వైరముత్తుపై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన గాయని చిన్మయి శ్రీపాద(Chinmayi Sripada), ఈ పురస్కార ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసేటప్పుడు వ్యక్తిగత ప్రవర్తనను, నైతికతను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. ఈ వివాదంలో కేవలం వైరముత్తు మాత్రమే కాకుండా, ఆయనను సమర్థిస్తున్న సినీ, రాజకీయ దిగ్గజాలపై కూడా చిన్మయి విమర్శలు ఎక్కుపెట్టారు. లోకనాయకుడు కమల్ హాసన్ ను కూడా ఆమె టార్గెట్ చేశారు.
Chandrababu Naidu: అల్లు వారింటికి ఏపీ సీఎం చంద్రబాబు.. కొత్త జంటకు శుభాకాంక్షలు.. ఫొటోలు
జయకాంతన్ తర్వాత 20 ఏళ్లకు ఒక తమిళుడికి ఈ గౌరవం దక్కడం గర్వకారణమని, వైరముత్తు తన ఆప్తమిత్రుడని కొనియాడుతూ కమల్ హాసన్ పోస్ట్ పెట్టడం వివాదంగా మారింది. ఏఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. “సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖులు బాధితుల గోడును వినడానికి నిరాకరిస్తున్నారు” అంటూ కమల్ వైఖరిని ఆమె తప్పుబట్టారు. పురుషులు ఎప్పుడూ తమ ‘బ్రదర్స్, అంకుల్స్, ఫ్రెండ్స్’ వైపే నిలబడతారని, మహిళల ఆవేదన కంటే వారి స్నేహాలకే విలువ ఇస్తారని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.
నిజం మాట్లాడినందుకు తాను తమిళ చిత్ర పరిశ్రమలో డబ్బింగ్, సింగింగ్ పరంగా అనధికారిక నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఎంతోమంది మహిళల గొంతును వ్యవస్థాగతంగా తొక్కేశారని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరో మహిళలు తమ కలలను వదులుకున్నా పట్టించుకోని ఈ సమాజం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అగ్రతాంబూలం ఇవ్వడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని ఆమె ఆరోపించారు. సాహితీ గౌరవానికి, సామాజిక నైతికతకు మధ్య జరుగుతున్న ఈ పోరాటం ఇప్పుడు కేవలం ఒక అవార్డు చుట్టూ కాకుండా, బాధితుల గొంతుకను వినే వ్యవస్థ ఉందా లేదా అనే పెద్ద ప్రశ్నగా రూపాంతరం చెందింది. అంటూ ఆమె కామెంట్స్ చేశారు. దాంతో, చిన్మయి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.
