Realme P4s Leak : భారీ బ్యాటరీతో కొత్త రియల్‌మి P4s వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!
Realme P4s Leak : రియల్‌మి పీ4ఎస్ ఫోన్ ఈ నెలాఖరులో లాంచ్ కానుంది. 8,000mAh బ్యాటరీతో మిడ్ రేంజ్ ఫోన్ రానుంది. పూర్తి ఫీచర్ల వివరాలు ముందుగానే లీక్ అయ్యాయి..

Realme P4s Leak : రియల్‌మి ఫ్యాన్స్‌కు పండగే.. కొత్త రియల్‌మి ఫోన్ రాబోతుంది. ఆగస్టు నెలాఖరులోగా కొత్త రియల్‌మి P4s ఫోన్ లాంచ్ కానుంది. అంతకన్నా ముందుగానే ఈ ఫోన్లో అద్భుతమైన 8000mAh బ్యాటరీ, కెమెరా ఇతర ఫీచర్లు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

భారత్‌లో రియల్‌మి P4s లాంచ్ :
భారత మార్కెట్లో రియల్‌మి P4s స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. ఈ ఫోన్ ఆగస్టు చివరిలో లాంచ్ అవుతుందని అంచనా. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ముందే లీక్ అయ్యాయి. ఈ ఫోన్లో భారీ 8000mAh బ్యాటరీ ఉండొచ్చు.

రియల్‌మి P4s ఫోన్ 8000mAh బ్యాటరీతో వస్తుందని 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని అంచనా.

ఈ ఫోన్లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K రిజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది. ఈ ప్యానెల్ అమోల్డ్ స్క్రీన్‌తో వస్తుందని అంచనా. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్సెట్తో రన్ అవుతుందని భావిస్తున్నారు.

రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో రియల్‌మి 50MP ప్రైమరీ కెమెరా ఉంటుందని అంచనా. ఈ ఫోన్లో సెకండరీ సెన్సార్ కూడా ఉండొచ్చు. కానీ, వివరాలు ఇంకా రివీల్ కాలేదు. సేఫ్టీ కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉండొచ్చు. ఈ ఫోన్ IP69-రేటింగ్‌తో రావచ్చు.

ఈ ఫోన్లో 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉంటాయి. అదనంగా, ఈ ఫోన్ 8GB, 12GB, 256GB వరకు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ కోసం గ్రీన్, బ్రౌన్ కలర్ షేడ్స్ కలర్ ఆప్షన్లలో రానుంది. ఈ స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
