Monsoon Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. దంచికొట్టనున్న భారీ వర్షాలు
బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీరానికి సమీపంలో నూతనంగా అల్పపీడనం(Monsoon Alert) ఏర్పడింది.
Bay of bengal low pressure imd issues heavy rainfall alert across multiple states
- బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం
- పలు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు
Monsoon Alert: బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ – ఉత్తర ఒడిశా తీరానికి సమీపంలో నూతనంగా అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆగస్టు 17న భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు ప్రకటించారు. వాతావరణంలో సంభవిస్తున్న ఈ ఆకస్మిక మార్పుల పట్ల ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
Cm Revanth Reddy: అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం.. ములుగులో సీఎం రేవంత్
ఉత్తరాది, తూర్పు రాష్ట్రాల్లో వర్షాల హోరు:
అల్పపీడనం కారణంగా ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వర్ష(Monsoon Alert) తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో అత్యంత తీవ్ర వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. మరోవైపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లోనూ వర్షాలు ముంచెత్తనున్నాయి. హిమాచల్‌లోని 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి.
మధ్య, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి:
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, విదర్భ, గోవా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ సహా ఈశాన్య రాష్ట్రాల్లోనూ వర్షాల ప్రభావం కొనసాగనుంది. ఇక దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, రాజస్థాన్‌లో వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టి పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని IMD స్పష్టం చేసింది.
