Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ ‘డబుల్’ ధమాకా.. సోషియో ఫాంటసీతో సరికొత్త ప్రయోగం!
ఒకేసారి రెండు సినిమాలను ఒకే చేసిన సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్న స్టార్ బాయ్.
Siddu Jonnalagadda making a film featuring socio-fantasy elements.
- స్టార్ బాయ్ సిద్దు వేగం పెంచారు
- ఒకేసారి రెండు క్రేజీ ప్రాజెక్టులు
- స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం పక్కా ప్లానింగ్
Siddu Jonnalagadda: టాలీవుడ్ ‘స్టార్ బాయ్’ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తున్నాడు. సినిమాల ఎంపికలో వేగాన్ని పెంచేశాడు. టిల్లు స్క్వైర్ తరువాత ఆయన చేసిన రెండు సినిమాలు డిజాస్టర్ అవగా.. విజయం కోసం పక్కా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే, ఇప్పుడు ఒకేసారి రెండు భిన్నమైన ప్రాజెక్టులను ఒకే చేశాడు సిద్దు. ఇప్పటికే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.
Chinmayi Sripada: వైరముత్తుకు ‘జ్ఞాన’ గౌరవం.. చిన్మయి సంచలన కామెంట్స్.. కమల్ హాసన్ ను కూడా వదలలేదు
ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే నెల నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే, అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ సిద్ధు(Siddu Jonnalagadda) తాజాగా మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల ఓ కొత్త దర్శకుడు చెప్పిన వినూత్నమైన సోషియో ఫాంటసీ కథకు సిద్ధు ఫిదా అయ్యారట. ఇప్పటివరకు ఎక్కువగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్, క్రైమ్ కామెడీలతో మెప్పించిన సిద్ధు, మొదటిసారి సోషియో ఫాంటసీ జోనర్లోకి అడుగుపెడుతుండటం టాలీవుడ్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, స్వరూప్ సినిమాతో పాటు ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని కూడా సైమల్టేనియస్ గా షూటింగ్ పూర్తి చేయాలని సిద్ధు ప్లాన్ చేస్తున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా స్క్రిప్ట్ పనుల్లోనూ తనదైన ముద్ర వేసే సిద్ధు, ఈ రెండు సినిమాలతో తన మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు చూస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీగా గడుపుతూ, తక్కువ కాలంలోనే ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధు జొన్నలగడ్డ పక్కా స్కెచ్ వేశారు. మరి ఈ రెండు సినిమాలు ఆయనకు మంచి కంబ్యాక్ ఇస్తాయా అనేది చూడాలి.
