Gam Gam Ganesha : ‘గం గం గణేశా’ మూవీ రివ్యూ.. ‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ మళ్ళీ హిట్ కొట్టాడా?

బేబీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ తన స్టైల్ మార్చి ‘గం గం గణేశా' సినిమాతో వచ్చాడు.

Gam Gam Ganesha : ‘గం గం గణేశా’ మూవీ రివ్యూ.. ‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ మళ్ళీ హిట్ కొట్టాడా?

Anand Deverakonda Pragati Srivastava Gam Gam Ganesha Movie Review and Rating

Gam Gam Ganesha Movie Review : బేబీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) తన స్టైల్ మార్చి ‘గం గం గణేశా’ సినిమాతో వచ్చాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతి శ్రీ వాత్సవ, నయన్ సారిక హీరోయిన్స్ గా తెరకెక్కిన ‘గం గం గణేశా’ సినిమా నేడు మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉదయ్‌ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాని నిర్మించారు.

కథ విషయానికొస్తే.. గణేష్(ఆనంద్ దేవరకొండ), శంకర్(జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్) హైదరాబాద్ లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ లైఫ్ గడుపుతూ ఉంటారు. గణేష్ ప్రేమించిన శృతి(నయన్ సారిక) వేరే వాళ్ళని పెళ్లి చేసుకోడానికి రెడీ అవ్వడంతో డబ్బుల కోసమే తనని వదిలేసిందని ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అని ఓ డైమండ్ దొంగతనం చేసే డీల్ అరుణ్ సుతారియా(బిగ్‌బాస్ ప్రిన్స్ యావర్) దగ్గర తీసుకుంటాడు గణేష్.

అదే సమయంలో నంద్యాలలో బై ఎలక్షన్ వస్తే అక్కడి ఇండిపెండెంట్ క్యాండిడేట్ కిషోర్ రెడ్డి(రాజ్ అర్జున్)ని ఓడించడానికి ప్రభుత్వం ట్రై చేస్తుంది. ఎలాగైనా గెలవాలని కిషోర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో 100 కోట్లు ఎన్నికలకు కావాలి. దీంతో ముంబై నుంచి ఆ డబ్బులను వినాయకుడి విగ్రహంలో పెట్టి తీసుకొచ్చే పని రుద్ర(కృష్ణ చైతన్య)కు అప్పచెప్తాడు. గణేష్ డైమండ్ దొంగతనం చేశాడా? రుద్ర ఆ డబ్బులు ఉన్న వినాయక విగ్రహం తీసుకొచ్చాడా? గణేష్ కి, వినాయక విగ్రహానికి సంబంధం ఏంటి? కిషోర్ రెడ్డి గెలిచాడా? ఆ విగ్రహం కోసం ఇంకెవరెవరు వచ్చారు? గణేష్ లైఫ్ లో సక్సెస్ అయ్యాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Bhaje Vaayu Vegam : ‘భజే వాయు వేగం’ మూవీ రివ్యూ.. తండ్రి కోసం ఇద్దరు కొడుకులు ఏం చేశారు?

సినిమా విశ్లేషణ.. క్రైం కామెడీ జానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఒక వస్తువు కోసం గ్రూపులు గ్రూపులుగా వచ్చే కన్ఫ్యూజ్ స్క్రీన్ ప్లే ఎప్పుడూ వర్కౌట్ అవుతుంది. ఈ సినిమాలో కూడా ఒక విగ్రహం కోసం కొన్ని గ్రూపులు ఎందుకు వచ్చాయి అని క్లైమాక్స్ లో రివీల్ చేసి ట్విస్టులు అదరగొట్టారు. ఫస్ట్ హాఫ్ నుంచి నవ్విస్తూనే ఉంటారు. కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. సెకండ్ హాఫ్ ట్విస్టులు, కామెడీ ఇంకా బాగుంటాయి. కొన్ని ఊహించని ట్విస్టులు కూడా క్లైమాక్స్ లో రివీల్ చేయడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. మొత్తానికి నవ్విస్తూనే ఫుల్ గా నెక్స్ట్ ఏం జరుగుతుందని టెన్షన్ పెట్టారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఇప్పటివరకు అన్నీ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ లు చేసిన ఆనంద్ దేవరకొండ మొదటిసారి ఈ సినిమాలో ఫుల్ యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొత్త హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్, ఎనర్జిటిక్ గా కనిపించి ఈ సినిమా కోసం కొత్తగా అయితే ట్రై చేసాడు. మొదటిసారి ఆనంద్ డ్యాన్స్ వేసి అదరగొట్టేసాడు. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఫుల్ లెంగ్త్ కమెడియన్ క్యారెక్టర్ చేసి ప్రేక్షకులని ఫుల్ గా నవ్వించాడు. వెన్నెల కిషోర్ కూడా కడుపుబ్బా నవ్విస్తాడు. విలన్ గా కిషోర్ రెడ్డి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నయన్ సారిక కాసేపే కనపడినా క్యూట్ గా మెప్పించింది. ప్రగతి శ్రీ వాత్సవ సెకండ్ హాఫ్ లో పల్లెటూరి అమ్మాయిలా కనిపించి అందంతో, నటనతో మెప్పించింది. సత్యం రాజేష్, ప్రిన్స్, కృష్ణ చైతన్య.. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల మేరకు నటించి అలరించారు.

సాంకేతిక అంశాలు.. ముఖ్యంగా ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అదిరిపోయింది. ఇలాంటి జానర్ లో పలు సినిమాలు వచ్చినా ఈ సినిమా కోసం వాటికి డిఫరెంట్ గా స్క్రీన్ ప్లే రాసుకొని కామెడీ, ట్విస్ట్ లతో అదరగొట్టాడు డైరెక్టర్. మొదటి సినిమాతోనే ఉదయ్ శెట్టి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. పాటలు కూడా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా బాగున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ వర్క్ కూడా మెచ్చుకోవచ్చు. కొత్త నిర్మాతలు అయినా బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘గం గం గణేశా’ సినిమా ఒక గణేశుడి విగ్రహం కోసం కొంతమంది ఏం చేశారు అని కామెడీ ట్విస్టులతో ఆసక్తికరంగా చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

 

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.