CM Jagan : లండన్ పర్యటన ముగించుకొని ఏపీకి చేరుకున్న సీఎం జగన్.. ఘనస్వాగతం పలికిన పార్టీ నేతలు

విదేశీ పర్యటన ముగించుకొని ఏపీకి చేరుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులకు వైసీపీ నేతలు గన్నవరం ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు.

CM Jaganmohan Reddy

CM Jagan : సీఎం జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం తన సతీమణి భారతితో కలిసి సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లారు. పదిహేను రోజుల విదేశీ పర్యటన అనంతరం శనివారం ఉదయం జగన్ దంపతులు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్ కు స్వాగతం పలికిన వారిలో మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, వెల్లంపల్లి శ్రీనివాస్, వల్లభనేని వంశీ మోహన్, తదితరులు ఉన్నారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం జగన్ దంపతులు తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.

Also Read :Lok Sabha Election 2024 : కొనసాగుతున్న చివరి విడత పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ఏపీలో మే 13న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 17న సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులు లండన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. లండన్, స్విట్జర్లాండ్ దేశాల్లో వారి పర్యటన సాగింది. 15రోజుల తరువాత తిరిగి వారు స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో వారికి ఘన స్వాగతం పలికారు. ఇదిలాఉంటే ఈనెల 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఇవాళ లేదా రేపు పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ.. గెలుపుపై వైసీపీ ధీమాకు కారణమేంటి? విజయంపై కూటమి కాన్ఫిడెన్స్ ఏంటి?