Vignesh Shivan : 12 ఏళ్ళ క్రితం చెప్పులతో 1000 రూపాయలతో ఇక్కడికి పర్మిషన్ కోసం వచ్చా.. కాని ఇవాళ..

తాజాగా విగ్నేష్ శివన్ తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసాడు.

Vignesh Shivan Shares an Emotional Post in Social Media with Remembering Olden Days

Vignesh Shivan : నయనతార(Nayanthara) భర్త, దర్శకుడి విగ్నేష్ శివన్ ప్రస్తుతం తమిళ్ లో దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తున్నాడు. నిర్మాతగా కుడా పలు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఇక నయనతారతో ప్రేమాయణం, పెళ్లి, కవల పిల్లలతో లైఫ్ కూడా హ్యాపీగా సాగిపోతుంది. విగ్నేష్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు, సినిమాల గురించి పోస్ట్ చేస్తూ ఉంటాడు. తాజాగా విగ్నేష్ శివన్ తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసాడు.

Also Read : Vishwak Sen : రాజమండ్రిలో అలా చేద్దామనుకున్నాం.. కానీ ఎన్నికల కోడ్ వల్ల..

హాంగ్ కాంగ్ లో ఉన్న డిస్నీలాండ్ కి భార్య పిల్లలతో విగ్నేష్ వెకేషన్ కి వెళ్ళాడు. అక్కడ డిస్నీలాండ్ బయట ఫ్యామిలీతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. 12 ఏళ్ళ క్రితం ఇక్కడికి వచ్చాను. చెప్పులు వేసుకొని, జేబులో 1000 రూపాయలతో పోడా పొడి షూటింగ్ కి పర్మిషన్ అడగడానికి వచ్చాను. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు నా భార్య, పిల్లలతో ఫ్యామిలీగా వచ్చాను. చాలా ఎమోషనల్ గా, సంతృప్తికరంగా ఉంది అని ఎమోషనల్ పోస్ట్ చేసాడు.

దీంతో విగ్నేష్ పోస్ట్ వైరల్ అవ్వగా నయన్, పిల్లలు ఉయర్, ఉలగం లతో డిస్నీలాండ్ బయట దిగిన ఫోటోలు అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.