Vishwak Sen : రాజమండ్రిలో అలా చేద్దామనుకున్నాం.. కానీ ఎన్నికల కోడ్ వల్ల..
విశ్వక్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో తన మాస్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసాడని ప్రేక్షకులు అంటున్నారు.

Vishwak Sen Planning Gangs Of Godavari Promotions in Godavari Districts but Due to Election Code it Doesn't Happen
Vishwak Sen : విశ్వక్ సేన్ నిన్న మే 31న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. విశ్వక్ అయితే తన మాస్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసాడని ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో నేహశెట్టి (Neha Shetty), అంజలి (Anjali) ఫిమేల్ లీడ్స్ లో నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కృష్ణచైతన్య దర్శకత్వంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
సాధారణంగా గోదావరి అంటే పచ్చని పొలాలు, నది.. ఇలా చూపిస్తారు సినిమాల్లో. కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో వీటితో పాటు పగలు, ప్రతీకారాలు అంటూ యాక్షన్ సీన్స్ చూపించారు. మూవీ టీమ్ కూడా గోదావరిని ఈ సినిమాలో కొత్తగా చూపించాము అని ముందు నుంచి చెప్తూ వచ్చారు. అయితే గోదావరి జిల్లాల్లో షూటింగ్ చేసి, గోదావరిని కొత్తగా చూపించి మరి అక్కడ సినిమా ప్రమోషన్స్ చేయలేదు ఎందుకు అని మీడియా అడగ్గా విశ్వక్ సమాధానమిచ్చాడు.
Also Read : MR. & MRS. MAHI : ‘మిస్టర్ & మిసెస్ మహీ’ మూవీ రివ్యూ.. క్రికెటర్‌గా జాన్వీ కపూర్..
విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. మేము ముందే అనుకున్నాము. రాజమండ్రిలో నది పక్కన సాయంత్రం పూట ఈ సినిమా ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా చేద్దాము అనుకున్నాము. కానీ అప్పుడు ఏపీలో ఎన్నికల కోడ్ ఉండటంతో పర్మిషన్ రాకపోవడంతో హైదరాబాద్ లోనే చేయాల్సి వచ్చింది అని తెలిపాడు.