Anil Sunkara : అఖిల్ కోసమే అంటూ.. మరోసారి ఏజెంట్ ఫ్లాప్ గురించి మాట్లాడిన నిర్మాత..

ఇటీవల అనిల్ సుంకర శ్రీవిష్ణుతో 'సామజవరగమన' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయి ఫుల్ కలెక్షన్స్ తెప్పిస్తుంది. తాజాగా సామజవరగమన సక్సెస్ మీట్ లో అనిల్ సుంకర మాట్లాడుతూ మరోసారి ఏజెంట్ ఫ్లాప్ గురించి మాట్లాడారు.

Anil Sunkara spoke about Agent Movie result again

Anil Sunkara Agent Movie : ఇటీవల అఖిల్(Akhil) హీరోగా సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో వచ్చిన భారీ సినిమా ఏజెంట్. AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ పరాజయం పాలైంది. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత నిర్మాతే స్వయంగా సినిమా ఫ్లాప్ అని ఒప్పుకుంటూ, బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా షూట్ కి వెళ్ళమని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా సంచలనంగా మారింది.

ఇటీవల అనిల్ సుంకర శ్రీవిష్ణుతో ‘సామజవరగమన’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయి ఫుల్ కలెక్షన్స్ తెప్పిస్తుంది. తాజాగా సామజవరగమన సక్సెస్ మీట్ లో అనిల్ సుంకర మాట్లాడుతూ మరోసారి ఏజెంట్ ఫ్లాప్ గురించి మాట్లాడారు.

అనిల్ సుంకర మాట్లాడుతూ.. బౌండెడ్ స్క్రిప్ట్ తో సెట్ కి వెళ్తే నిర్మాణ వ్యయం నియంత్రణలో ఉంటుంది. ఫలితం అటు ఇటు అయినా కొంచెమే ప్రభావం ఉంటుంది. ఏజెంట్ విషయంలో అదే తప్పు జరిగింది. రకరకాల కారణాలతో ఏజెంట్ సినిమాకు బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే షూట్ కి వెళ్ళాం. నేనైనా, దర్శకుడు అయినా ఈ సినిమాతో అఖిల్ ని మరో స్థాయికి తీసుకెళదామనే ఈ సినిమా చేశాం. కానీ ఫలితం వేరేలా వచ్చింది. అందులో మా అందరిదీ తప్పు ఉంది. నేను ఆ తప్పు తెలుసుకున్నాను, ఇంకో నిర్మాత ఆ తప్పు చేసి నష్టపోకూడదనే ఆ ట్వీట్ చేశాను అని అన్నారు.

Sonu Sood : హీరోయిన్ కోసం దోశెలు వేసిన రియ‌ల్ హీరో.. ఫైర్ అయిన నెటీజ‌న్లు

త్వరలో అనిల్ సుంకర నిర్మాతగా మెగాస్టార్ భోళా శంకర్ సినిమాతో రాబోతున్నారు. దాంతో పాటు హిడింబ, ఊరి పేరు భైరవకోన అనే మరో రెండు చిన్న సినిమాలు కూడా ఆయన నిర్మాణంలో రానున్నాయి.

ట్రెండింగ్ వార్తలు