Ajay Ghosh : అజయ్ ఘోష్ ఫస్ట్ సినిమా ఏంటో తెలుసా? ఆ హీరో సినిమాలో 23 ఏళ్ళ క్రితం..

అజయ్ ఘోష్ ఎప్పుడో 25 ఏళ్ళ క్రితమే సినీ పరిశ్రమకు వచ్చినా ఇన్నాళ్ళకి గుర్తింపు వచ్చింది.

Do You Know Actor Ajay Ghosh First Movie before 23 Years

Ajay Ghosh : ప్రస్తుతం అజయ్ ఘోష్ విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. విలన్, కమెడియన్, ఎమోషనల్.. ఇలా అన్ని రకాల పాత్రలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. ఇటీవలే మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలో ఏకంగా తనే మెయిన్ లీడ్ గా నటించి ప్రేక్షకులని మెప్పించి హిట్ కొట్టారు అజయ్ ఘోష్. ఎంత ఎదిగినా, పాపులారిటీ వచ్చినా సింపుల్ గా ఉంటూ అన్ని ఈవెంట్స్ కి కూడా అలాగే సింపుల్ గా పైజామా, లుంగీతో వస్తూ అందరితో మంచిగా ఉంటూ మరింత పాపులర్ అయ్యారు.

అయితే అజయ్ ఘోష్ ఎప్పుడో 25 ఏళ్ళ క్రితమే సినీ పరిశ్రమకు వచ్చినా ఇన్నాళ్ళకి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. తాజాగా అజయ్ ఘొష తన మొదటి సినిమా గురించి తెలిపాడు. అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా మంచి హిట్ అవ్వడంతో తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి సీనియర్ డైరెక్టర్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అతిథిగా వచ్చారు.

Also Read : Pawan Kalyan – Sai Durgha Tej : పవన్ కళ్యాణ్ నిర్మాతగా సాయి దుర్గ తేజ్ హీరోగా.. స్టార్ డైరెక్టర్‌తో సినిమా.. కానీ..

ఈ ఈవెంట్లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. సినిమా హిట్ చేసినందుకు ధన్యవాదాలు. తమ్మారెడ్డి భరద్వాజ గారిని మళ్ళీ ఇన్నాళ్లకు కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు నాకు సినీ పరిశ్రమలో మొదటి ఛాన్స్ ఇచ్చింది ఆయనే. 2001లో తమ్మారెడ్డి భరద్వాజ గారి రామ్మా చిలకమ్మా సినిమాలో నేను మొదటిసారి నటించాను. సుమంత్ ఆ సినిమా హీరో. అందులో నేను లాయర్ పాత్ర పోషించాను. నేను మొదట మేకప్ వేసుకుంది ఆయన సినిమాకే అని తెలిపారు.

అయితే దీని గురించి తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. అసలు అజయ్ ఘోష్ కి నేనే ఛాన్స్ ఇచ్చానని నేను మర్చిపోయాను. తాను చెప్పేదాకా కూడా నాకు గుర్తులేదు. అసలు అజయ్ ఘోష్ మెయిన్ లీడ్ లో సినిమా ఏంటి అనుకున్నాను కానీ సినిమా చూసాక ఏడ్చేసాను అంత బాగా నటించాడు అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు