×
Ad

సామాన్యుడిలా ప్రభుత్వ ఆఫీసుకి వెళ్లిన ఎమ్మెల్యే.. అడ్డంగా దొరికిపోయిన ఉద్యోగి

డ్యూటీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే బాలరాజు.

  • Published On : July 29, 2024 / 09:10 PM IST

Mla Chirri Balaraju : ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కన్నాపురం ఐటీడీఏ కార్యాలయంలో పబ్జీ ఆడుతున్న ఉద్యోగిని ఎమ్మెల్యే పట్టుకున్నారు. సాధారణ పౌరుడిలా మాస్క్ పెట్టుకుని పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఐటీడీఏ కార్యాలయానికి వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగులు ఏం చేస్తున్నారో గమనించారు. ఈ క్రమంలో ఓ ఉద్యోగి అడ్డంగా దొరికపోయాడు. డ్యూటీ టైమ్ లో సాయి కల్యాణ్ అనే ఉద్యోగి పబ్జీ ఆడుతూ ఎమ్మెల్యేకి కనిపించారు. దీంతో ఆయన ఆ ఉద్యోగిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సాయి కల్యాణ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే బాలరాజు.

ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీ టైమ్ లో డ్యూటీ తప్ప మరొకటి చేయకూడదన్నారు ఎమ్మెల్యే బాలరాజు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

Also Read : మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కుట్రకోణం ఉంది, ఎంతటి వారున్నా వదిలేది లేదు- మంత్రి సత్యప్రసాద్