అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించాలి: హైకోర్టులో ఆళ్ల పిటిషన్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు ఇటీవలే నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
Alla Ramakrishna Reddy
- ఈ నెల 24న విచారణకు వచ్చే అవకాశం
- ఇప్పటికే కేసును క్లోజ్ చేస్తున్నట్లు చెప్పిన సీఐడీ
- అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ఆళ్లకు ఏసీబీ కోర్టు నోటీసులు
Amaravati: రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేశారు. ఆయన వేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Also Read: ఏపీలో ఈ 2 యూనివర్సిటీలు ఫేక్.. UGC ప్రకటన.. దేశవ్యాప్తంగా 32.. ఫుల్ లిస్ట్ ఇదే..
కాగా, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు ఇటీవలే నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇన్నర్ రింగ్ రోడ్ కేసును క్లోజ్ చేస్తున్నట్లు ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది.
ఈ కేసులో అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.
