AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..
ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే వాసుదేవ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు రద్దు చేసింది.
AP Liquor Scam Case Representative Image (Image Credit To Original Source)
- ఏ2 నిందితుడు వాసుదేవరెడ్డి అరెస్ట్
- లిక్కర్ స్కామ్ కేసులో కీలకంగా వ్యవహరించిన వాసుదేవరెడ్డి
- వైసీపీ ప్రభుత్వంలో ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ఎండీగా పని చేసిన వాసుదేవరెడ్డి
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2 నిందితుడు వాసుదేవ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కీలకంగా ఉన్న వాసుదేవ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) ఎండీగా పని చేశారు. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు రద్దు చేసింది.
గత వైసీపీ ప్రభుత్వంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి ఏ1 కాగా, వాసుదేవరెడ్డి ఏ2గా ఉన్నారు. రూ.3500 లిక్కర్ స్కామ్ కేసులో కీలకమైన నిందితుడిగా వాసుదేవ రెడ్డి ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో వాసుదేవ రెడ్డి పాత్ర కీలకంగా గుర్తించారు. వైసీపీ హయాంలో ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించిన వాసుదేవరెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో కీలక సూత్రధారి అని సిట్ భావిస్తోంది. కొంతకాలంగా ఆయనను అరెస్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
బేవరేజస్ కార్పొరేషన్ ఎండీగా పని చేస్తున్న సమయంలో నిబంధనలకు విరుద్దంగా కొన్ని మద్యం కంపెనీలకు టెండర్లు కట్టబెట్టడం ద్వారా వాసుదేవరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని సిట్ ఆరోపిస్తోంది. ఈ కేసులో తన అరెస్ట్ ఖాయమని తెలియడంతో ముందస్తు బెయిల్ కోసం కింది కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే అక్కడ ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది.
లిక్కర్ కుంభకోణం జరగడానికి కారణమైన విధాన రూపకల్పన, అమలులో వాసుదేవరెడ్డి పాత్ర ఉందని సిట్ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఏ1తో పాటు చాలా మంది అరెస్ట్ అయినా వాసుదేవరెడ్డి మాత్రం ఇంకా బయటే ఉన్నారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసి అప్పట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని సిట్ ప్రయత్నిస్తోంది. వాసుదేవరెడ్డి అరెస్ట్ లో లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు 28 మందిని నిందితులుగా చేర్చింది సిట్. చాలా మందిని ఇప్పటివరకు అరెస్ట్ కూడా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించిన వాసుదేవ రెడ్డి ఈ స్కామ్ లో కీలకంగా వ్యవహరించారని, ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని, ఈ కేసు ప్రస్తుతం కీలకమైన దశకు వచ్చిందని, ఈ సమయంలో బెయిల్ ఇస్తే ఆయన చాలా ప్రభావితం చేస్తారని వాదనలు వినిపించింది సిట్.
Also Read: అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు..! కేసు కీలక టర్న్?
