Varun Tej : భీమవరం సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది.. OG సినిమాతో మొదలుపెట్టాం.. వరుణ్ కామెంట్స్..
ఈ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. (Varun Tej)
Varun Tej
Varun Tej : మెగా హీరో వరుణ్ తేజ్ ఆగస్టు 7న కొరియన్ కనకరాజు సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భీమవరంలోని SRKR ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించారు.
ఈ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. నేను 2018లో తొలిప్రేమ సినిమా సమయంలో ఇక్కడికి వచ్చాను. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇదే కాలేజీలో జరిగింది. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడకు వచ్చాను. అదే సెంటిమెంట్ వర్కౌట్ అయి ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ కాలేజీతో నేను చదవకపోయినా నాకు మంచి అనుబంధం ఉంది. నా ఫ్రెండ్ పేరెంట్స్ ఈ కాలేజీలో భాగస్వాములు, వాళ్ళు చాలా సపోర్ట్ చేసారు నేను ఇక్కడకు రావడానికి.
Also Read : Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ భిక్షు యాదవ్ ఇక లేరు.. పవర్ ఫుల్ విలన్ కన్నుమూత..
మా ఫ్యామిలీ OG సినిమాతో మొదలుపెట్టారు. సంక్రాంతికి శంకరవరప్రసాద్ రఫ్ఫాడించారు. పెద్దితో చరణ్ అన్న అదరగొట్టాడు. వాళ్ళ రేంజ్ లో కాకపోయినా నా రేంజ్ లో చిన్నగా సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తాను అని అన్నారు. దీంతో వరుణ్ ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది.
