OPPO A7 Pro Max Launch : చార్జింగ్ టెన్షన్ గుడ్‌బై.. 10,000mAh బ్యాటరీతో కొత్త ఒప్పో A7 ప్రో మ్యాక్స్ ఎంట్రీ.. ధర జస్ట్ ఎంతంటే?
OPPO A7 Pro Max Launch : భారీ బ్యాటరీతో ఒప్పో ఎ7 ప్రో మ్యాక్స్ ఫోన్ వచ్చేసింది. 50MP ప్రైమరీ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరాతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ధర వివరాలివే..
OPPO A7 Pro Max Launch
- ఒప్పో A7 ప్రో మ్యాక్స్‌లో 6.78-అంగుళాల ఫుల్-HD+ అమోల్డ్ డిస్ప్లే
- 10,000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా సెటప్
- ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ఓఎస్ 16, మరెన్నో కలర్ ఆప్షన్లు
OPPO A7 Pro Max Launch : ఒప్పో లవర్స్ కోసం అదిరిపోయే ఫోన్.. చైనా మార్కెట్లో ఒప్పో కొత్త A7 ప్రో మ్యాక్స్ వచ్చేసింది. ఈ ఒప్పో A7 ప్రో మ్యాక్స్‌లో 10,000mAh బ్యాటరీ ఉంది. ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 సిరీస్ చిప్సెట్తో రన్ అవుతుంది. ఒప్పో A7 ప్రో మ్యాక్స్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఒప్పో A7 ప్రో మ్యాక్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
ఒప్పో A7 ప్రో మాక్స్ ధర :
ఒప్పో A7 ప్రో మ్యాక్స్ ఫోన్ 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,199 (సుమారుగా రూ. 31వేలు), 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,699 (సుమారుగా రూ. 38వేలు), 12GB/512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,999 (సుమారుగా రూ. 42వేలు)గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 7 నుంచి ఒప్పో ఆన్లైన్ స్టోర్ ద్వారా (OPPO A7 Pro Max Launch) చైనాలో అమ్మకానికి రానుంది. ఈ ఫోన్ డార్క్ మౌంటెన్స్ (బ్లాక్), రైడింగ్ ది వేవ్స్ (బ్లూ), ది ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ (ఆరెంజ్) కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Read Also : OnePlus 16 Launch : వారెవ్వా..! మతిపోగొట్టే ఫీచర్లతో వస్తోన్న వన్‌ప్లస్ 16.. లాంచ్‌కు ముందే లీక్స్ వైరల్!
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఒప్పో A7 ప్రో మ్యాక్స్‌లో 1272×2772 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 330Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్-HD+ అమోల్డ్ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 చిప్సెట్తో రన్ అవుతుంది. 12GB LPDDR4x ర్యామ్, 512GB యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందిస్తుంది.
ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69K రేటింగ్ అందిస్తుంది. A7 ప్రో మ్యాక్స్ 10,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.1, సింగిల్ యూఎస్బీ టైప్-సి పోర్ట్, జీపీఎస్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ఓఎస్ 16పై రన్ అవుతుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. :
ఒప్పో A7 ప్రో మ్యాక్స్‌లో బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ సైడ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఎఫ్/2.4 అపర్చర్‌తో 2MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.
ఈ ఫోన్లో ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఇ-కంపాస్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. కొలతల పరంగా చూస్తే.. ఈ ఫోన్ 162.98 మిమీ పొడవు, 77.97 మిమీ వెడల్పు, 8.57 మిమీ మందం, 226 గ్రాముల బరువు ఉంటుంది.
