Vivo Y32 5G Launch : 8000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో కొత్త వివో Y32 5G వచ్చేసింది.. ధర జస్ట్ ఎంతంటే?
Vivo Y32 5G Launch : వివో నుంచి 8000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అద్భుతమైన 5జీ ఫోన్ రిలీజ్ అయింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, ఆండ్రాయిడ్ 6 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 16తో అత్యంత ఆకర్షణీయంగా ఉంది.. ధర ఎంతంటే?
Vivo Y32 5G Launch
- వివో Y32 5G ఫోన్ ఆండ్రాయిడ్ 6 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 16
- 8,000mAh బ్యాటరీ, 6.87 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే
- 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు, 120Hz రిఫ్రెష్ రేట్
Vivo Y32 5G Launch : వివో కొత్త 5G ఫోన్ వచ్చేసింది.. వివో Y32 5G ఎట్టకేలకు అధికారికంగా లాంచ్ అయింది. అయితే, కంపెనీ ఇంకా ధర, సేల్ తేదీని రివీల్ చేయలేదు.. వివో వై32 5జీ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్తో రన్ అవుతుంది. 8,000mAh బ్యాటరీతో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్ అందిస్తుంది. వివో Y32 5జీ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..
వివో Y32 5జీ ధర ఎంతంటే? :
వివో తైవాన్ అధికారిక వెబ్సైట్లో వివో వై32 5జీ ఫోన్ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ లిస్టు అయింది. కంపెనీ ఇంకా ధర ఎంత అనేది రివీల్ చేయలేదు. ఈ వివో ఫోన్ డాన్ గోల్డ్ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది..
వివో Y32 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
వివో Y32 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్ అందిస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4వ జనరేషన్ 2 చిప్సెట్తో రన్ అవుతుంది. 6GB LPDDR4X ర్యామ్, 128GB UFS2.2 ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది..
మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా ర్యామ్ 6GB వరకు, స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించవచ్చు. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 8,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. కొలతలు 169.55mm పొడవు, 79.20mm వెడల్పు, 8.79/8.69mm మందం, బరువు 229/230 గ్రాములు ఉంటుంది. సేఫ్టీ కోసం ఈ ఫోన్లో సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అమర్చారు.
ఈ వివో 5జీ ఫోన్ 1592 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.87-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 16.8 మిలియన్ రంగులు 255పీపీఐ పిక్సెల్ డెన్సిటీకి సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, డ్యూయల్-సిమ్ సపోర్ట్, వై-ఫై 5, ఇంటర్నెట్ కాలింగ్, బ్లూటూత్ 5.1, యూఎస్బీ 2.0, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, ఓటీజీ ఉన్నాయి.
వివో వై32 5జీ ఫోన్ రియర్ కెమెరా సెటప్‌లో ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఎఫ్/2.4 అపర్చర్‌తో 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.05 అపర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్లోని ఇతర సెన్సార్లలో గ్రావిటీ సెన్సార్, లైట్ సెన్సార్, డిస్టెన్స్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, మోటార్ సెన్సార్ ఉన్నాయి.
