Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ భిక్షు యాదవ్ ఇక లేరు.. పవర్ ఫుల్ విలన్ కన్నుమూత..
నటుడు ప్రదీప్ సింగ్ రావత్ కొద్దిసేపటి క్రితమే మరణించారు. (Pradeep Rawat)
Pradeep Rawat
Pradeep Rawat : నేడు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నో సినిమాల్లో విలన్ గా పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ తో భయపెట్టిన నటుడు ప్రదీప్ సింగ్ రావత్ కొద్దిసేపటి క్రితమే మరణించారు.
హిందీలో 1985 లోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టాడు ప్రదీప్ రావత్. ఈయన పూర్తిపేరు ప్రదీప్ రామ్ సింగ్ రావత్. మధ్యప్రదేశ్ జబల్ పూర్ ఈయన స్వస్థలం. 2004 తెలుగులో రాజమౌళి – నితిన్ సై సినిమాలో విలన్ గా నటించి ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఆ వెంటనే సూర్య గజినీ సినిమాలో కూడా విలన్ గా నటించి మరింత స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. అక్కడ్నుంచి వరుసగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో విలన్ గా నటిస్తూ వచ్చాడు, మధ్యమధ్యలో కొన్ని కమెడియన్ పాత్రలు కూడా చేసాడు ప్రదీప్ రావత్. సై సినిమాలో ఇతని నటనకు బెస్ట్ విలన్ గా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఛత్రపతి సినిమాతో రాజమౌళి ఈ నటుడికి మరింత ఫేమ్ ఇచ్చాడు. తెలుగులో చివరగా ఇటీవలే గాయపడ్డ సింహం సినిమాలో కనిపించి నవ్వించారు.
Also Read : Siddharth Galla : కాబోయే భార్యతో ఐర్లాండ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు మేనల్లుడు.. ఫొటోలు వైరల్..
ప్రదీప్ రావత్ మరణించినట్టు బాలీవుడ్ నటుడు యాష్ పాల్ శర్మ ప్రకటించారు. 74 ఏళ్ళ వయసులో బ్లడ్ క్లాట్ అవడంతో ప్రదీప్ రావత్ కు గుండెపోటు వచ్చి ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు సాయంత్రం 5.30కి తుది శ్వాస విడిచినట్టు సమాచారం.
View this post on Instagram
