Nani : రెమ్యునరేషన్ తగ్గించను అంటున్న నాని..? భారీ బడ్జెట్‌తో నాని సినిమాలకు కష్టాలు..

నానితో కొత్త సినిమాలు చేసేందుకు చాలా మంది నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నట్లు చెబుతున్నారు.

Nani High Remuneration gives Budget Problems to Producers Rumours goes Viral

Nani : తన నటనతో, తన సినిమాలతో ప్రేక్షకులని మెప్పించాడు నాని. న్యాచురల్ స్టార్ ట్యాగ్ తెచ్చుకొని ఆల్మోస్ట్ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. ఒకానొక సమయంలో వరుస హిట్స్ తో అదరగొట్టాడు. కానీ ఇప్పుడు భారీగా పెరిగిన బడ్జెట్‌ న్యాచురల్ స్టార్‌ నాని సినిమాలకు బ్రేక్‌ వేస్తోందని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. సినిమా బడ్జెట్‌ ఎంతైనా తన రెమ్యునరేషన్‌ విషయంలో నాని రాజీ పడటం లేదంటున్నారు. దీంతో సినిమా సక్సెస్‌ కాకపోయినా, నానికి భారీగా పారితోషికం చెల్లించాల్సిరావడంతో నిర్మాతలకు నష్టాలే వస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే నానితో కొత్త సినిమాలు చేసేందుకు చాలా మంది నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నట్లు చెబుతున్నారు.

నాని తాజాగా నటిస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’. వచ్చేనెల ఆగస్టు 29న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాకు సరైన ప్రమోషన్‌ లేదని ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సినిమాకు రిలీజ్ కష్టాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. సరిపోదా శనివారం సినిమాకు ఓవర్ బడ్జెట్ అవ్వటంతో బిజినెస్ జరగటం లేదని అంటున్నారు. ఒక సినిమాకు సుమారు 40 కోట్లు రెమ్యునరేషన్‌గా హీరో తీసుకోవడమే నిర్మాతలకు భారమవుతుందంటున్నారు. హీరో పారితోషికంతోనే బడ్జెట్‌ డబుల్‌ అవుతుందని విశ్లేషిస్తున్నాయి సినీ వర్గాలు. నాని గత సినిమా హాయ్ నాన్న కూడ ఎక్కువ బడ్జెట్ పెట్టారు. కానీ కలెక్షన్స్ ఆశినంతగా లేక నిర్మాత నష్టపోయారంటున్నారు. సినిమా కలెక్షన్లు లేకపోయినా తన తన రెమ్యూనరేషన్ మాత్రం నాని తగ్గించట్లేదని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా బిజినెస్‌పైనా దీని ఎఫెక్ట్ బాగా పడిందని టాలీవుడ్ టాక్. భారీ రెమ్యునరేషన్‌ తీసుకుంటుండటం వల్ల నాని సినిమాలకు బడ్జెట్‌ రెండింతలు అవుతుందని దానికి తగ్గట్టు బిజినెస్‌ జరగకపోవడంతో ఆయనతో సినిమాలు చేయాలంటేనే నిర్మాతలు భయపడిపోతున్నారని అంటున్నారు.

Also Read : Allu Sirish : అల్లు శిరీష్ సినిమా టికెట్ రేట్లు మరీ ఇంత తక్కువా? ‘బడ్డీ’ పాన్ ఏంటి?

నాని గతంలో నటించిన దసరా సినిమా ఫర్వాలేదనిపించినా, హాయ్ నాన్న సినిమా బాగున్నా కమర్షియల్ గా నిరుత్సాహ పరిచింది. ఇక తాజా సినిమా సరిపోదా శనివారం బిజినెస్‌ కూడా ఆశించనంత జరగడం లేదంటున్నారు. ఒక్క నైజాం ఏరియాలో తప్ప, మిగతా ప్రాంతాల్లో సినిమా బిజినెస్ జరగలేదని, చాలా తక్కువ రేట్‌కు అడుగుతున్నారని మేకర్స్ ఫీల్ అవుతున్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో నానితో సినిమాలు చెయ్యలని చూసిన రెండు బ్యానర్స్ ఓవర్ బడ్జెట్ సాకుతో ముందుగానే క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తోంది. కలెక్షన్లతో సంబంధం లేకుండా నాని బడ్జెట్ పెంచుకుంటూ పోతుంటే నిర్మాతలు దొరకడం కష్టమని అంటున్నారు సినీ పండితులు. మరి ఇది ఎంతవరకు నిజమో నానికి, నిర్మాతలకే తెలియాలి.

ట్రెండింగ్ వార్తలు