Allu Sirish : అల్లు శిరీష్ సినిమా టికెట్ రేట్లు మరీ ఇంత తక్కువా? ‘బడ్డీ’ ప్లాన్ ఏంటి?

కొంచెం గ్యాప్ తర్వాత బడ్డీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అల్లు శిరీష్. ఆగస్టు 2న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

Allu Sirish : అల్లు శిరీష్ సినిమా టికెట్ రేట్లు మరీ ఇంత తక్కువా? ‘బడ్డీ’ ప్లాన్ ఏంటి?

Allu Sirish Buddy Movie Ticket Rates Huge Discount

Allu Sirish : అల్లు శిరీష్ మొదట్నుంచి కొత్త కొత్త కథలతో వస్తున్నాడు. అయితే పలు సినిమాలు విజయాలు సాధించినా, కొన్ని సినిమాలు బాగున్నా భారీ కమర్షియల్ హిట్ మాత్రం అల్లు శిరీష్ కి ఇంకా పడలేదు. 2022లో చివరిసారిగా ఊర్వశివో రాక్షశివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత బడ్డీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అల్లు శిరీష్.

అల్లు శిరీష్, గాయత్రీ భరద్వాజ్ జంటగా స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ నిర్మాణంలో సామ్ అంటోన్ ద‌ర్శ‌క‌త్వంలో అజ్మల్ అమీర్, ప్రిషా సింగ్, ముఖేష్ రిషి, అలీ.. ముఖ్య పాత్రలతో ఈ బడ్డీ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకు టికెట్ రేట్లు చాలానే తగ్గించారు. ఇటీవల సినిమా టికెట్ రేట్లు బాగా పెరిగిన సంగతి తెలిసిందే. మినిమమ్ 200 నుంచి 500 వరకు టికెట్ రేట్లు ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో అల్లు శిరీష్ తన సినిమా టికెట్ రేట్లను బాగా తగ్గించి జనాలకు చేరువవుదామనుకుంటున్నాడు.

Also Read : PV Sindhu – Chiranjeevi : చిరు అంకుల్ అంటూ PV సింధు స్పెషల్ పోస్ట్.. పారిస్ ఒలంపిక్స్ నుంచి..

అల్లు శిరీష్ బడ్డీ సినిమా సింగిల్ స్క్రీన్స్ లో కేవలం 99 రూపాయలు, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో కేవలం 125 రూపాయలు మాత్రమే పెట్టారు. థియేటర్స్ వద్ద ఈ రేటుకే సినిమా టికెట్ అమ్ముతారు. ఆన్లైన్ లో తీసుకుంటే మాత్రం ఆన్లైన్ చార్జీలు కామన్. దీంతో ఈ విషయంలో అల్లు శిరీష్ ని అభినందిస్తున్నారు. మరి ఈ టికెట్ రేట్ల తగ్గింపు అల్లు శిరీష్ కి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.