PV Sindhu – Chiranjeevi : చిరు అంకుల్ అంటూ PV సింధు స్పెషల్ పోస్ట్.. పారిస్ ఒలంపిక్స్ నుంచి..

మెగా ఫ్యామిలీ కూడా పారిస్ ఒలంపిక్స్ కి వెళ్లడంతో సింధుతోనే ఉంటున్నారు. సింధు ముందు నుంచి మెగా ఫ్యామిలీకి చాలా క్లోజ్.

PV Sindhu – Chiranjeevi : చిరు అంకుల్ అంటూ PV సింధు స్పెషల్ పోస్ట్.. పారిస్ ఒలంపిక్స్ నుంచి..

PV Sindhu Special Post on Megastar Chiranjeevi and Mega Family

Updated On : July 29, 2024 / 7:54 PM IST

PV Sindhu – Chiranjeevi : పారిస్ లో ఒలంపిక్స్ ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ సారి పారిస్ ఒలంపిక్స్ కి మెగా ఫ్యామిలీ వెళ్లిన సంగతి తెలిసిందే. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా.. ఇలా ఫ్యామిలీ అంతా వెళ్లారు. గత మూడు రోజులుగా మెగా ఫ్యామిలీ పారిస్ ఒలంపిక్స్ నుచి ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంది.

అయితే ఈ ఒలంపిక్స్ లో PV సింధు కూడా ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ రెండు ఒలంపిక్ మెడల్స్ సాధించిన సింధు ఈసారి కూడా మెడల్ సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఈసారి PV సింధుని మెగా ఫ్యామిలీ దగ్గరుండి మరీ సపోర్ట్ చేస్తుంది. సింధు ముందు నుంచి మెగా ఫ్యామిలీకి చాలా క్లోజ్. మెగా ఫ్యామిలీ కూడా పారిస్ ఒలంపిక్స్ కి వెళ్లడంతో సింధుతోనే ఉంటున్నారు. ఆల్రెడీ సింధు తన ఫస్ట్ మ్యాచ్ లో గెలిచింది. ఫస్ట్ మ్యాచ్ మొదలయ్యే ముందు నుంచి గెలిచే వరకు మెగా ఫ్యామిలీ సింధూతోనే ఉండి ఎంతో ఎంకరేజ్ చేసారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ సింధుతో ఉన్న పలు ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది.

Also Read : Tamil Film Industry : నటీనటులకు షాక్ ఇచ్చిన తమిళ పరిశ్రమ.. ఇకపై అడ్వాన్స్‌లు తీసుకోవడం నిషేధం..

తాజాగా సింధు కూడా చిరంజీవితో, మెగా ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలని షేర్ చేసి.. పారిస్ ఒలంపిక్స్ లో నాకు లవ్లీ సర్ ప్రైజ్ ఏంటంటే చిరు అంకుల్, మొత్తం ఫ్యామిలీ, క్లిన్ కారాతో సహా రావడమే. చాలా కొద్దిమంది మాత్రమే క్లాస్, మాస్, చార్మ్, గ్రేస్ గా ఉంటారు చిరంజీవి అంకుల్ లాగా. సినిమాల్లో చాలా గౌరవించే యాక్టర్ చిరు. ఆయన లాగా ఎవరూ ఉండలేరు. ఉపాసన, చరణ్, చిరు అంకుల్, సురేఖ ఆంటీ మీరంతా చాలా స్పెషల్ అని పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సింధు పోస్ట్ చేసిన ఫొటోలు చూసి మెగా అభిమానులు సంతోషిస్తున్నారు. ఇక సింధు ఈసారి కూడా మెడల్ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఇండియా కోరుకుంటుంది.

View this post on Instagram

A post shared by PV Sindhu (@pvsindhu1)