Tamil Film Industry : నటీనటులకు షాక్ ఇచ్చిన తమిళ పరిశ్రమ.. ఇకపై అడ్వాన్స్‌లు తీసుకోవడం నిషేధం..

తాజాగా తమిళ నిర్మాతల మండలి తీసుకున్న కఠిన నిర్ణయాలు..

Tamil Film Industry Takes Strict Decisions on Actors

Tamil Film Industry : తమిళ నిర్మాతల మండలి తమిళ సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలపై ఫోకస్ పెట్టింది. రెమ్యునరేషన్స్ పెంచేసిన నటీనటులు, ఓటీటీ రిలీజ్ లపై చర్చలు మొదలుపెట్టింది. అలాగే నిర్మాతలని ఇబ్బంది పెట్టే నటీనటులకు షాక్ ఇచ్చింది. ఆల్రెడీ నవంబర్ 1 నుంచి సమస్యలు తీరేవరకు షూటింగ్స్ బంద్ అని తెలిపారు. తాజా తమిళ మీడియా సమాచారం ప్రకారం మరిన్ని నిర్ణయాలు తీసుకుంటుంది తమిళ సినీ పరిశ్రమ.

ముఖ్యంగా అడ్వాన్స్ లు తీసుకొని సినిమాలు పూర్తి చేయని నటీనటులపై కొరడా ఝుళిపిస్తుంది తమిళ నిర్మాతల మండలి. తాజాగా తమిళ నిర్మాతల మండలి తీసుకున్న కఠిన నిర్ణయాలు..

#ఆగస్ట్ 15 తరువాత ఎలాంటి కొత్త సినిమా షూటింగ్స్ మొదలు పెట్టకూడదు.

#పెండింగ్ లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తరువాతే ఎవరైనా కొత్త సినిమాలు మొదలు పెట్టాలి.

#అక్టోబర్ 31 కల్లా పెండింగ్ లో ఉన్న షూట్స్ అన్ని ముగించాలి.

#పెండింగ్ మూవీలు, వాటికి ఇచ్చిన అడ్వాన్స్ ల గురించి నిర్మాతలు నివేదిక ఇవ్వాలి.

#ఇక నుంచి ఏ నటీనటులైనా ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకు డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేయాలి.

#ఇకపై ఏ హీరో, హీరోయిన్ కూడా ముందే ఒకేసారి పలు సినిమాల అడ్వాన్స్ తీసుకోవడం నిషేధం. సినిమా షూటింగ్ మొదలయ్యే ముందు మాత్రమే ఏ సినిమా అప్పుడు ఆ సినిమా అడ్వాన్స్ తీసుకోవాలి.

#స్టార్ హీరోల సినిమాలు సినిమా రిలీజయిన రెండు నెలల తర్వాతే ఓటీటీలోకి రావాలి.

Also Read : Prabhas – RajaSaab : రాజాసాబ్.. సంక్రాంతి నుంచి సమ్మర్‌కి వాయిదా.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్..

ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకొని సినీ పరిశ్రమని బాగు చేయాలని తమిళ నిర్మాతల మండలి కంకణం కట్టుకుంది. మరి ఇలాంటి కఠిన నిర్ణయాలకు తమిళ నటీనటులు ఎలా స్పందిస్తారో చూడాలి.

అలాగే తమిళ్ స్టార్ హీరో ధనుష్ తీరుపై తమిళ నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. పలువురి దగ్గర అడ్వాన్స్ లు తీసుకొని షూటింగ్స్ పూర్తి చేయడం లేదని ధనుష్ పై పిర్యాదులు రావడంతో నిర్మాతల మండలి పర్మిషన్ ఉంటేనే ఇకపై ధనుష్ తో సినిమాలు తీయాలి. లేకపోతే ధనుష్ తో సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది తమిళ నిర్మాతల మండలి. మరి దీనిపై ధనుష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు