Prabhas – RajaSaab : రాజాసాబ్.. సంక్రాంతి నుంచి సమ్మర్‌కి వాయిదా.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్..

తాజాగా గ్లింప్స్ రిలీజ్ తో పాటు రాజాసాబ్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

Prabhas – RajaSaab : రాజాసాబ్.. సంక్రాంతి నుంచి సమ్మర్‌కి వాయిదా.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్..

Prabhas RajaSaab Movie Postponed from 2025 Sankranthi Glimpse Released

Updated On : July 29, 2024 / 5:28 PM IST

Prabhas – RajaSaab : ప్రభాస్ ఇటీవల కల్కి సినిమాతో 1000 కోట్ల భారీ హిట్ కొట్టాడు. కల్కి తర్వాత రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ అవ్వగా మిగతా సగం ఆగస్టు నుంచి మొదలవుతుందని సమాచారం.

తాజాగా రాజాసాబ్ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ చాలా క్రొత్తగా బాగుంది. దీంతో ఈ గ్లింప్స్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే రాజాసాబ్ సినిమాని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ తాజాగా గ్లింప్స్ రిలీజ్ తో పాటు రాజాసాబ్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

Also Read : RajaSaab Glimpse : ప్రభాస్ ‘రాజాసాబ్’ గ్లింప్స్ వచ్చేసింది.. కానీ యూట్యూబ్ సర్వర్ డౌన్..

రాజాసాబ్ సినిమాని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో సంక్రాంతి నుంచి రాజాసాబ్ సినిమా సమ్మర్ కి వాయిదా పడటంతో ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక రాజాసాబ్ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. హారర్ కామెడీ రొమాంటిక్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.