RajaSaab Glimpse : ప్రభాస్ ‘రాజాసాబ్’ గ్లింప్స్ వచ్చేసింది..
తాజాగా ప్రభాస్ రాజాసాబ్ సినిమా పాన్ ఇండియా గ్లింప్స్ రిలీజ్ చేసారు.

Prabhas The RajaSaab Movie Pan India Glimpse Released
Prabhas RajaSaab Glimpse : ఇటీవలే ప్రభాస్ కల్కి సినిమాతో భారీ 1100 కోట్ల హిట్ కొట్టి బోలెడన్ని రికార్డులు సృష్టించారు. కల్కి విజయంపై ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కల్కి సినిమా తర్వాత కూడా ప్రభాస్ కి భారీ లైనప్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నెక్స్ట్ రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు.
మారుతీ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రాజాసాబ్ సినిమా తెరకెక్కుతుంది. వచ్చే సంక్రాంతికి రాజాసాబ్ సినిమాని రిలీజ్ చేస్తామని గతంలో మారుతి ప్రకటించాడు. ఆల్రెడీ సగం షూటింగ్ అవ్వగా మిగిలిన భాగం ఆగస్టులో మొదలవుతుందని సమాచారం. గతంలో రాజాసాబ్ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. నిన్న నిర్మాణ సంస్థ రాజాసాబ్ గ్లింప్స్ రిలీజ్ చేస్తామని అప్డేట్ ఇచ్చింది.
Also Read : Movie Shootings : మళ్ళీ సినిమా షూటింగ్స్ బంద్.. ఎప్పట్నించి అంటే..? రెమ్యునరేషన్స్ ఎక్కువయ్యాయి అని..
తాజాగా ప్రభాస్ రాజాసాబ్ సినిమా పాన్ ఇండియా గ్లింప్స్ రిలీజ్ చేసారు. గ్లింప్స్ లో ప్రభాస్ స్టైలిష్ గా బండి మీద వచ్చి పూలతో తనకి తాను దిష్టి తీసుకున్నాడు. హారర్, రొమాంటిక్, కామెడీ కథాంశంతో ఈ సినిమా రానుంది. ఇక సంక్రాంతికి అనౌన్స్ చేసిన సినిమా సమ్మర్ కి వాయిదా పడింది. 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ఈ గ్లింప్స్ తో ప్రకటించారు. మీరు కూడా రాజాసాబ్ గ్లింప్స్ చూసేయండి..
Revealing the Majestic Vintage Vibe of Darling #Prabhas ?#TheRajaSaab ??? ????? ??????? is out now ?https://t.co/lQsnQgrPIN
? ?????’? ????????????? ???????? ????????? ?? ????? ????, ???? ?… pic.twitter.com/weDuakN82N
— People Media Factory (@peoplemediafcy) July 29, 2024