Movie Shootings : మళ్ళీ సినిమా షూటింగ్స్ బంద్.. ఎప్పట్నించి అంటే..? రెమ్యునరేషన్స్ ఎక్కువయ్యాయి అని..

కొన్ని సినిమా రోజులు షూటింగ్స్ ఆపనున్నారు.

Movie Shootings : మళ్ళీ సినిమా షూటింగ్స్ బంద్.. ఎప్పట్నించి అంటే..? రెమ్యునరేషన్స్ ఎక్కువయ్యాయి అని..

Tamil Film Producers Council wants to stop Movie Shootings Details Here

Updated On : July 29, 2024 / 4:54 PM IST

Movie Shootings : గతంలో కరోనా తర్వాత తెలుగు పరిశ్రమ నష్టాల్లో ఉండటంతో సినీ పెద్దలు అందరూ పలు ప్రెస్ మీట్స్ పెట్టి పెరిగిన వ్యయాల గురించి చర్చించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కొన్ని రోజులు సినిమా షూటింగ్స్ కూడా ఆపేసారు. ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమ కూడా అదే పని చేయబోతుంది. తమిళ్ లో కూడా కొన్ని రోజులు షూటింగ్స్ ఆపనున్నారు.

తమిళ సినీ పరిశ్రమలో నటీనటుల పెరిగిన రెమ్యునరేషన్స్, ఇతర ప్రొడక్షన్ కాస్ట్ లు, ఓటీటీలో లేట్ గా రిలీజ్ చేయాలని.. ఇలా పలు అంశాలపై చర్చించడానికి తమిళ నిర్మాతల మండలి సిద్ధమైంది. దీని కోసం కొన్ని రోజులు షూటింగ్ ఆపి అన్ని క్రాఫ్ట్స్ లో పనిచేసే వాళ్ళతో, అన్ని యూనియన్స్ తో చర్చించనున్నారు. ఇందుకోసం నవంబర్ 1 నుంచి కొన్ని రోజులు తమిళ పరిశ్రమ షూటింగ్స్ ఆపనున్నట్టు తమిళ మీడియా సమాచారం.

Also Read : Ajay Ghosh : అజయ్ ఘోష్ ఫస్ట్ సినిమా ఏంటో తెలుసా? ఆ హీరో సినిమాలో 23 ఏళ్ళ క్రితం..

అయితే దీనికి చాలానే టైం ఉంది. మరి తమిళ నిర్మాతల మండలి నటీనటులతో మాట్లాడి రెమ్యునరేషన్స్ తగ్గించమని చెప్తుందా, ఓటీటీ రిలీజ్ లను తొందరగా అవ్వకుండా ఆపుతుందా చూడాలి.