×
Ad

Telugu Film Chamber : తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త అధ్యక్షడు.. సినీ పరిశ్రమ కోసం అందరం కలిసి..

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2024-25 సంవత్సర కాలానికి తాజాగా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరిగాయి.

  • Published On : July 29, 2024 / 04:28 PM IST

New President and Vice President Elected for Telugu Film Chamber of Commerce

Telugu Film Chamber of Commerce : తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2024-25 సంవత్సర కాలానికి తాజాగా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో నూతన అధ్యక్షులుగా పి. భరత్ భూషణ్ ఎంపికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా నిర్మాత కె. అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడారు.

Also Read : Pawan Kalyan – Sai Durgha Tej : పవన్ కళ్యాణ్ నిర్మాతగా సాయి దుర్గ తేజ్ హీరోగా.. స్టార్ డైరెక్టర్‌తో సినిమా.. కానీ..

ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త అధ్యక్షుడు భరత్ భూషణ్ మాట్లాడుతూ నా విజయానికి సహకరించిన ఈసీ మెంబర్స్ కి, మిత్రులకు అందరికి ధన్యవాదాలు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి నా వంతు కృషి నేను చేస్తాను అని తెలిపారు. నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇవాళ గెలిచిన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇద్దరూ మాటకు కట్టుబడి ఉంటారు. అందరు కలసి మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తాము. ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని తీర్చడానికి అందరం కలిసి పనిచేస్తాము. గెలిచిన వారందరికీ మా మద్దతు ఉంటుంది అని తెలిపారు.

నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఫిలిం చాంబర్ అంతా ఒక కుటుంబం. ఇండస్ట్రీలోని సమస్యలను ఎలా ఎదుర్కోవాలో అందరం కలసి చర్చిస్తాము. భారతదేశంలోని ఇతర సినీ ఇండస్ట్రీలని ఒకతాటి పైకి తీసుకొచ్చి ముందుకెళ్తాము అని తెలిపారు.