Bigg Boss 10 Day 2 Promo : బిగ్ బాస్ ప్రోమో.. ఏడ్చేసిన చరణ్.. ఓదార్చిన దేబ్జానీ అక్క.. ఇవాళ ఎపిసోడ్ లో ఏం అవుతుందో..
బిగ్ బాస్ రెండో రోజు ప్రోమోలు ఇప్పటికే రిలీజ్ చేసారు.(Bigg Boss 10 Day 2 Promo)
Bigg Boss 10 Day 2 Promo
Bigg Boss 10 Day 2 Promo : బిగ్ బాస్ రెండో రోజు ప్రోమోలు ఇప్పటికే రిలీజ్ చేసారు. ఒక ప్రోమోలో నామినేషన్స్ గొడవ చూపించారు. ఇంకో ప్రోమోలో నిన్న మహాపరిక్ష కోసం ఇద్డు లీడర్స్ ని సెలెక్ట్ చేసుకోగా ఆ ఇద్దరి టీమ్స్ ఒక టాస్క్ ఆడినట్టు చూపించారు. అవతలి టీమ్ వాళ్లపై గన్ తో బులెట్స్ వేసే టాస్క్ వేయగా ఇందులో కూడా గొడవలు పెట్టుకున్నారు. దీంతో ఈ మహాపరిక్ష టఫ్ గానే ఉండబోతుందని తెలుస్తుంది.
ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అగ్నిపరీక్ష నుంచి వచ్చిన చరణ్ ఎవరితో కలవట్లేదని అందరూ అతనికి చెప్తున్నారు. దేబ్జానీ అయితే నాగార్జున ఇచ్చిన బ్యాడ్జీలతో డేలులు బ్యాడ్జ్ చరణ్ కి ఇచ్చింది. నువ్వు ఇక్కడే ఉన్నావు కానీ క్కడ లేనట్టు ఉంటున్నావు అని చెప్పింది. అందరూ చరణ్ ని టార్గెట్ చేయడంతో చరణ్ ఏడ్చేశాడు. దీంతో దేబ్జానీ ఎందుకు ఏడుస్తున్నావు, నీ అక్కను నేను అంటూ ఓదార్చింది. మరి ఇవాళ్టి ఎపిసోడ్ లో మహాపరిక్ష టాస్క్, చరణ్ ఎమోషన్స్, నామినేషన్స్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
