Raviteja : వామ్మో.. ఇరుముడి సినిమాకు రవితేజకు అన్ని కోట్లు ఇచ్చారా? మాస్ మహారాజ ప్లాన్ మాములుగా లేదుగా..
సాధారణంగా రవితేజ ఒక సినిమాకు దాదాపు 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.(Raviteja)
Raviteja
Raviteja : రవితేజ ఇరుముడి సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆల్మోస్ట్ 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా బాగా లాభపడ్డాడు. సాధారణంగా రవితేజ ఒక సినిమాకు దాదాపు 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
అయితే ఇరుముడి సినిమాకు రవితేజ 8 కోట్లు అడ్వాన్స్ రెమ్యునరేషన్ తీసుకొని మిగతాది నైజాం హక్కులను తీసుకున్నారు. నిర్మాతలే ఈ సినిమాని స్వయంగా నైజాంలో రిలీజ్ చేసారు. ఈ సినిమా నైజాంలో షేర్ దాదాపు ఇప్పటి వరకు 55 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం. జీఎస్టీ, డిస్ట్రిబ్యూటర్స్ కమిషన్, రిలీజ్ ఖర్చులు.. ఇవన్నీ కనీసం పది కోట్లు పోయినా దాదాపు రవితేజకు 45 కోట్లు రెమ్యునరేషన్ గా వెళ్లనుంది. అడ్వాన్స్ 8 కోట్లు ప్లస్ నైజాం లాభాలు కలిపి కనీసం రవితేజ ఇరుముడి సినిమాకు 53 కోట్ల వరకు సంపాదించాడు.
Also Read : YouTuber Nandana : అరెస్ట్ అయిన యూట్యూబర్ నందన.. బిగ్ బాస్ లోకి వెళదామని ఇండియాకు వచ్చిందా?
దీంతో ఇరుముడి సినిమాతో రవితేజకు భారీగా సంపాదన వచ్చినట్టే. ఇరుముడి సినిమాతో రవితేజకు ఊహించని అదృష్టం వరించింది. 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే రవితేజకు ఏకంగా 53 కోట్లు వచ్చాయి.
