Anushka Shetty : అనుష్క గ్రాండ్ కంబ్యాక్ ఆ రోజే.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ అనౌన్స్..

ఇటీవల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Anushka Shetty and Naveen Polishetty movie MissShetty MrPolishetty releasing date announced

Naveen Polishetty : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) చివరగా నిశ్శబ్దం సినిమాతో 2020లో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అప్పట్నుంచి మూడేళ్లు అవుతున్నా అనుష్క నుంచి ఏ సినిమా రాలేదు. అయితే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty)తో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాని గతంలో ప్రకటించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. యువీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.

ఇటీవల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీలో అనుష్క చెఫ్ గా కనిపిస్తుంటే, నవీన్ స్టాండ్ అప్ కమెడియన్ గా కనిపించబోతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత అనుష్క ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుండటంతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Salaar Teaser : సలార్ టీజర్ రిలీజ్ డేట్ & టైం ఫిక్స్.. ప్రభాస్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారుగా..

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఆగస్టు 4న థియేటర్స్ లోకి రానున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అనుష్క అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందులో నవీన్ పోలిశెట్టి కూడా ఉండటంతో ఫుల్ గా నవ్విస్తాడని సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ సినిమాని సౌత్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు