Apple AirPods Pro 2 : USB టైప్-C పోర్టుతో ఆపిల్ ఎయిర్ ప్యాడ్స్ ప్రో 2 వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

Apple AirPods Pro 2 : ప్రముఖ కుపెర్టినో-దిగ్గజం ఆపిల్ (Apple) ఈ ఏడాది చివరిలో కొత్త ఇయర్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది. నివేదికల ప్రకారం.. ఎయిర్‌పాడ్స్ ప్రో 2 (Apple AirPods Pro 2) ఇయర్ ఫోన్‌లను రిలీజ్ చేసే అవకాశం ఉంది.

Apple AirPods Pro 2 : ప్రముఖ కుపెర్టినో-దిగ్గజం ఆపిల్ (Apple) ఈ ఏడాది చివరిలో కొత్త ఇయర్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది. నివేదికల ప్రకారం.. ఎయిర్‌పాడ్స్ ప్రో 2 (Apple AirPods Pro 2) ఇయర్ ఫోన్‌లను రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే, రాబోయే ఎయిర్‌పాడ్‌లు లైటనింగ్ పోర్ట్‌కు బదులుగా USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉండనున్నాయి.

పిల్ యూఎస్‌బీ పోర్ట్‌లకు మారడానికి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఎందుకంటే, విస్తృత శ్రేణి అప్లియెన్సెస్, ఛార్జర్‌లకు సపోర్టు అందిస్తుంది. తద్వారా మరింత సౌకర్యవంతంగా యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఆపిల్ USB టైప్-C పోర్ట్‌తో కూడిన AirPods ప్రో 2 ఈ ఏడాది చివరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.

Read Also : Stay Safe Online Campaign : స్టే సేఫ్ ఆన్‌లైన్ క్యాంపెయిన్.. సైబర్ మోసాల నుంచి సేఫ్‌గా ఉండాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పక తెలుసుకోండి!

AirPods ప్రో 2 USB-C వెర్షన్‌తో రావొచ్చునని భావిస్తున్నారు. ఆపిల్ ప్రస్తుతం AirPods 2 & 3 USB-C వెర్షన్‌ల కోసం ఎలాంటి ప్రణాళికలను కలిగి లేదని Kuo ట్విట్టర్‌లో తెలిపారు. లేటెస్ట్ iOS 16లో మోడల్ నంబర్‌లు A3048, A2968తో కొత్త AirPodలు వస్తాయని తెలిపింది. టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌తో రాబోయే AirPods ప్రో 2 కావచ్చని Kuo భావిస్తున్నారు.

Apple AirPods Pro 2 with USB Type-C port likely to launch later this year

కొత్త AirPods Pro 2 మోడల్ 2023 రెండో లేదా మూడో త్రైమాసికంలో ఎప్పుడైనా అందుబాటులోకి రావొచ్చునని అంచనా. AirPods 2, 3 మోడల్ USB-C వెర్షన్‌లతో ఆపిల్ లాంచ్ చేయకపోవచ్చు. ప్రీమియం డివైజ్‌లలో మాత్రమే USB-C సపోర్టు అందిస్తుంది.

ఆపిల్ iPhone 15 సిరీస్‌ను USB టైప్-C పోర్ట్‌తో లాంచ్ చేసే అవకాశం ఉంది. లీక్‌ల ప్రకారం.. ఆపిల్ USB-C పోర్ట్‌కు లైటనింగ్ పోర్ట్‌లోని అథెంటికేషన్ ప్రాసెస్ మాదిరిగానే కస్టమ్ IC చిప్‌ను యాడ్ చేయొచ్చు. మేడ్ ఫర్ ఐఫోన్ ప్రోగ్రామ్‌లో లేని ఆపిల్ యేతర యాక్సెసరీలు పని చేయకపోవచ్చు. స్పీడ్ ఛార్జింగ్, హై-స్పీడ్ డేటా ట్రాన్స్‌ఫర్ పరిమితం కావచ్చు.

USB-C యూనివర్సల్ ఇంటర్‌ఫేస్ అందించకపోతే.. EU జోక్యం చేసుకునే అవకాశం ఉంది. గతంలో ఆపిల్ ప్రపంచవ్యాప్త మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్రెగ్ జోస్వియాక్ అక్టోబర్‌లో వాల్ స్ట్రీట్ జర్నల్ టెక్ లైవ్ కాన్ఫరెన్స్‌లో ఆపిల్ ఈ నిబంధనను స్పష్టంగా పాటించవలసి ఉంటుందని చెప్పారు. EU ఆదేశాల ప్రకారం Apple USB టైప్ C పోర్ట్‌కి మారుతుందా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు.

Read Also : Maruti Suzuki SUV Cars : మారుతి సుజుకి నుంచి రెండు కొత్త మోడల్ SUV కార్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు