IND vs AUS ODI Series: మాక్స్‌వెల్, మిచెల్ వచ్చేస్తున్నారు.. ఇండియాతో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

ఇండియా వర్సెస్ ఆసీస్ జట్ల మధ్య మార్చి 17 నుంచి జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 16 మంది సభ్యులతో కూడిన టీంను ప్రకటించింది. జట్టు కెప్టెన్‌గా పాట్ కమిన్స్ కొనసాగనున్నాడు. ఇన్నాళ్లు గాయాలతో జట్టుకు దూరంగా ఉన్న ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌తోపాటు మిచెల్ మార్ష్, రిచర్డ్‌సన్‌లు వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు

IND vs AUS ODI Series: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్‌లు పూర్తికాగా ఆ రెండింటిల్లో టీమిండియా విజయం సాధించింది. మరో రెండు టెస్ట్ మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల అనంతరం ఇరు జట్ల మధ్య మార్చి 17నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతోంది. ఈ సిరీస్‌లో ఆసీస్, ఇండియా జట్లు మూడు వన్డే మ్యాచ్ లు ఆడుతాయి. ఇందుకు సంబంధించి ఆస్ట్రేలియా 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గాయం కారణంగా ఇండియాతో జరిగే రెండు టెస్టులకు దూరమైన డేవిడ్ వార్నర్ కు వన్డే జట్టులో అవకాశం దక్కింది.

IND vs AUS Test Match: నాలుగో టెస్ట్ మ్యాచ్‌‌‌కు భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు

ఇండియా వర్సెస్ ఆసీస్ జట్ల మధ్య మార్చి 17 నుంచి జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 16 మంది సభ్యులతో కూడిన టీంను ప్రకటించింది. జట్టు కెప్టెన్‌గా పాట్ కమిన్స్ కొనసాగనున్నాడు. ఇన్నాళ్లు గాయాలతో జట్టుకు దూరంగా ఉన్న ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌తోపాటు మిచెల్ మార్ష్, రిచర్డ్‌సన్‌లు వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. సెలక్షన్ కమిటీ హెడ్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. అరోన్ ఫించ్ రిటైర్మెంట్ తర్వాత వన్డే జట్టు పగ్గాలు కూడా పాట్ కమిన్స్‌కు ఇవ్వటం జరిగింది. కెప్టెన్‌గా అతనికి రెండో వన్డే సిరీస్ అవుతుందని తెలిపారు.

 

 

మాక్స్‌వెల్, మార్ష్ జట్టులోకి పునరాగమనం ఆస్ట్రేలియా జట్టుకు బలాన్ని చేకూర్చినట్లవుతుందని చెప్పొచ్చు. మిచెల్ మార్ష్ చీలమండ గాయంతో, మాక్స్‌వెల్ కాలుకు గాయంతో శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. ఫాస్ట్ బౌలర్ జాయ్ రుడ్సన్‌సైతం గాయం నుంచి కోలుకొని ఇండియాతో జరిగే వన్డే సిరీస్‌కు జట్టులో ఎంపికయ్యాడు. ఇదిలాఉంటే ఆసీస్, భారత్ వన్డే సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత్ జట్టును ప్రకటించింది.

తొలి వన్డే మ్యాచ్ – 17 మార్చి (అహ్మదాబాద్)
రెండో వన్డే మ్యాచ్ – 19 మార్చి (విశాఖపట్టణం)
మూడో వన్డే మ్యాచ్ – 22 మార్చి( చెన్నై)

ట్రెండింగ్ వార్తలు