Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఉండొచ్చు??

'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సోమవారం(ఫిబ్రవరి 21న) జరగాల్సి ఉంది. దీనికి కేటీఆర్ ముఖ్య అతిధిగా వస్తారని అనౌన్స్ చేసారు. అయితే నిన్న ఉదయం ఆంధ్రప్రదేశ్‌ మంత్రి............

Bheemla Nayak :  పవన్‌ కల్యాణ్‌, రానా హీరోలుగా, నిత్య మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భీమ్లా నాయక్’. త్రివిక్రమ్ మాటలు రాయగా సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమాని ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్స్ , సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.

 

‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సోమవారం(ఫిబ్రవరి 21న) జరగాల్సి ఉంది. దీనికి కేటీఆర్ ముఖ్య అతిధిగా వస్తారని అనౌన్స్ చేసారు. అయితే నిన్న ఉదయం ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణించడంతో ఆయన గౌరవార్థంగా ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేశారు. ఈ విషయాన్ని పవన్‌ కల్యాణ్‌తో పాటు చిత్ర యూనిట్‌ కూడా అధికారికంగా తెలిపింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో అభిమానులంతా నిరాశ చెందారు. అయితే భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ ని నిన్న రాత్రి విడుదల చేయడంతో పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

Vijay Devarakonda : విజయ్, రష్మికల పెళ్లి వార్తలు.. సెటైర్ వేస్తూ ఫైర్ అయిన రౌడీ హీరో..

ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భారీ సెట్ వేశారు. సినిమా రిలీజ్ కి ఇంకో మూడు రోజులు మాత్రమే టైం ఉంది. నిన్న ఈవెంట్ క్యాన్సిల్ అవ్వటంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఫిబ్రవరి 23 (బుధవారం) సాయంత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అభిమానులు ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు