Double ISMART Teaser : డబల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది.. దిమాక్ కిరికిరి టీజర్ అదుర్స్..
నేడు రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్భంగా డబల్ ఇస్మార్ట్ టీజర్ రిలీజ్ చేశారు.
- Saketh U
- Published On : May 15, 2024 / 10:06 AM IST
Ram Pothineni Puri Jagannadh Double Ismart Teaser Released
Double ISMART Teaser : పూరి జగన్నాధ్ (Puri Jagannadh), రామ్ పోతినేని(Ram Pothineni) కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ (ISmart Shankar)కు సీక్వెల్ గా ‘డబల్ ఇస్మార్ట్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతుంది. పూరి జగన్నాధ్ సొంత దర్శక నిర్మాణంలో డబల్ ఇస్మార్ట్ భారీగా చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.
ఇటీవలే డబల్ ఇస్మార్ట్ నుంచి రామ్ పోతినేని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. నేడు రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్భంగా డబల్ ఇస్మార్ట్ టీజర్ రిలీజ్ చేశారు. మీరు కూడా ఈ టీజర్ చూసేయండి.
ఇక ఈ టీజర్ చూస్తుంటే పార్ట్ 1 క్యారెక్టర్ ని, కథని కంటిన్యూ చేసినట్టు తెలుస్తుంది. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబల్ ఇస్మార్ట్ అంటూ రామ్ మాస్ ఎంట్రీ ఇచ్చి ఆ క్యారెక్టర్ ని చూపించారు. ఇక పవర్ ఫుల్ విలన్ గా సంజయ్ దత్ ని చూపించారు. రామ్ తెలంగాణ స్లాంగ్ లో ఇస్మార్ట్ శంకర్ స్టైల్ లో డైలాగ్స్ చెప్పి అదరగొట్టాడు. చివర్లో మళ్ళీ శివుడి రిఫరెన్స్ తో టీజర్ ని ముగించారు. దీంతో ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ శివుడి రిఫరెన్స్ తో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈసారి కూడా రామ్ డబల్ ఇస్మార్ట్ అంటూ హిట్ కొట్టబోతున్నాడని టీజర్ చూస్తుంటేనే తెలుస్తుంది.ఇక ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.
