Bheemla Nayak: పవర్ ప్యాక్డ్ ఈగో క్లాష్.. హీరో వర్సెస్ విలన్!

ఎక్కడో.. ఏదో తగ్గిందే అనిపించింది భీమ్లానాయక్ ట్రైలర్ 1 చూసినవాళ్లకి. కానీ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో రిలీజైన ట్రైలర్ చూసి పండుగ చేసుకున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. బాహుబలి తర్వాత..

Bheemla Nayak: ఎక్కడో.. ఏదో తగ్గిందే అనిపించింది భీమ్లానాయక్ ట్రైలర్ 1 చూసినవాళ్లకి. కానీ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో రిలీజైన ట్రైలర్ చూసి పండుగ చేసుకున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. బాహుబలి తర్వాత పవర్ఫుల్ హీరో వర్సెస్ అల్టిమేట్ విలన్ కాంబినేషన్ లో భీమ్లానాయక్ రెడీఅయినట్టు ట్రైలర్స్ చెప్పేశాయి. ఇద్దరి ఇగో పీక్స్ చేరితే ఎంతటి భీభత్సం సృష్టించగలదో సిల్వర్ స్క్రీన్ పై పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో చూపిస్తున్నారు భీమ్లా, డేనియల్.

Bheemla Nayak: మెగా బ్రదర్స్ పబ్లిసిటీ ఐడియా.. అదిరిందయ్యా చరణ్!

అల్టిమేట్ క్లాష్.. పవర్ఫుల్ కాంబినేషన్.. భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ తర్వాత వినిపిస్తున్న మాటలివి. భీమ్లానాయక్, డానియేల్ శేఖర్ మధ్య పవర్ఫుల్ సీక్వెన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చాలామందికి బాహుబలిని గుర్తుకుతెస్తుంది. అవును బాహుబలి తర్వాత.. మళ్లీ అంతగా హీరో – విలన్ రెండు క్యారెక్టర్లు కేవలం భీమ్లా నాయక్ లోనే ఎలివేట్ అయినట్టు కనిపిస్తోంది. ప్రభాస్ – రానా కాంబినేషన్ ఎంతలా మెస్మరైజ్ చేసిందో ఇప్పుడు పవన్ – రానా పోరాటం అంతే ఎక్జైట్ మెంట్ ను క్రియేట్ చేస్తోంది.

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ కి, రానాకి సెలబ్రిటీల విషెస్..

హీరో వర్సెస్ విలన్.. ఈక్వెల్ పవర్ ఫుల్ స్టామినాను సిల్వర్ స్క్రీన్ పై చూపించింది బాహుబలి. యుద్ధంలో రెండు శక్తులు తలపడితే ఎలా ఉంటుందో అప్పుడు రెబల్ స్టార్ తో ఇప్పుడు పవర్ స్టార్ తో ఢీకొట్టి చూపిస్తున్నాడు హ్యాండమ్ హంక్ రానా. భీమ్లానాయక్ సినిమా నడిచినంత సేపు ఇద్దరి పాత్రల్లో హీరో, విలన్.. రెండు షేడ్స్ కనిపిస్తాయి. ఇగో క్లాష్ ఎంతటి భీభత్సాన్ని సృష్టించిందో.. పవర్డ్ ప్యాక్డ్ స్క్రీన్ ప్లేతో డిజైన్ చేశాడు త్రివిక్రమ్. అందుకే ఎప్పుడెప్పుడా అని ఈ మాస్ మసాలా మూవీ కోసం ఫ్యాన్స్ అంతలా ఎదురుచూశారు.

Bheemla Nayak: వరల్డ్‌ వైడ్‌గా 3వేలకు పైగా థియేటర్లలో భీమ్లానాయక్‌ విడుదల

సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్.. రీసెంట్ ప్రీరిలీజ్ ఫంక్షన్ తో హైప్ ను అమాంతం పెంచేశాడు భీమ్లానాయక్. అందుకే గ్యాప్ ఇవ్వకుండా పవర్ స్టార్ మూవీని థియేటర్స్ లో ఎంజాయ్ చేసేందుకు ప్రేక్షకులు సిద్ధమయ్యారు. అనుకున్నట్లే ఫస్ట్ డే ఎక్కడ చూసినా జనసందోహం క్యూలు కట్టాయి. బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఇది ఇంకా పీక్స్ కి చేరుతుంది. 110 కోట్లతో బరిలోకి దూకిన భీమ్లాకు అంతకు మించిన రేంజ్ చూపించేలా ఉన్నారు ఫ్యాన్స్. హైదరాబాద్ లో ఫస్ట్ డే 787 షోలుంటే అన్ని షోలకు హౌజ్ బోర్డ్ పడగా.. మొదటిరోజు అడ్వాన్స్ బుకింగ్ మార్క్ ఒక్క హైదరాబాద్ లోనే 5 కోట్లను క్రాస్ చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అనే తేడాలేకుండా ప్రీ బుకింగ్ రికార్డ్ అంచనాలను దాటేసింది.

ట్రెండింగ్ వార్తలు