Catherine Tresa-Sandeep Madhav
Catherine Tresa-Sandeep Madhav : గ్రామీణ నేపథ్యంలో మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ‘ఓదెల రైల్వే స్టేషన్ ‘చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఆహా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ట్రెండింగ్లో నిలిచింది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు అశోక్ తేజ మరొక సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. యాక్షర్ థ్రిల్లర్గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా హీరోయిన్. ‘జార్జ్ రెడ్డి’, ‘వంగవీటి’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ మాధవ్ హీరోగా నటించనున్నాడు.
Ileana : ప్రియుడి ఫోటోని పోస్ట్ చేసిన ఇలియానా.. బిడ్డ పుట్టాక అయినా చూపిస్తావా అంటూ..
Catherine-Sandeep- Ashok Teja
కేసీఆర్ ఫిల్మ్స్, శ్రీ మహావిష్ణు మూవీస్ బ్యానర్లపై ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. దావులూరి జగదీష్, పల్లి కేశవరావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జూలై చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. సస్పెన్స్ ను ఎక్కడా రివీల్ చేయకుండా చివరి వరకు ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాని ఎంత ఆసక్తికరంగా అశోక్ తెరకెక్కించాడో.. అంతకుమించి ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతలు చెప్పారు.
Prabhas : ప్రాజెక్ట్ Kలో మహా విష్ణువు అవతారంలో కనిపించనున్న ప్రభాస్..!