Govt Tomato Sale : సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం టమాటాల అమ్మకాలు .. కిలో ఎంతంటే..?

కేంద్ర ప్రభుత్వం టమాటాల అమ్మకం ప్రారంభించింది. కిలో రూ.120 నుంచి రూ.130కు ధర పలుకుతున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా టమాటాలు అమ్ముతోంది.

Central Discounted Govt Tomato Sale : టమాటాల ధరలు దాదాపు రెండు సెంచరీలకు దగ్గరలో ఉండటంతో సామాన్యులు వాటి మాటే ఎత్తటంలేదు. అయినా దేశ వ్యాప్తంగా టమాటాల ధరలు మాత్రం రోజు రోజుకు పెరుగుతు కిలో రూ.160 నుంచి రూ.200ల వరకు అమ్ముతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు సబ్సిటీతో టమాటాలుఅమ్మాలని నిర్ణయించింది. దేశంలో మొత్తం టమాటా పంటల ఉత్పత్తిలో 56-58 శాతం దక్షిణ, పశ్చిమ భారత్ నుంచే జరుగుతోంది. దీంతో కేంద్రం ఎక్కువ టమాటాల ఉత్పత్తి ప్రాంతాల్లో టమాటాలు కొని దేశంలో ఎక్కువ ధరలు అమ్మే రాష్ట్రాల్లో ప్రజలకు సబ్సిటీ ద్వారా అమ్మేందుకు చర్యలు చేపట్టింది. దీని కోసం ఇప్పటికే టమాటాలను కొన్న టమాటాలు ఢిల్లీకి చేరుకోగా వాటిని పలు రాష్ట్రాలకు తరలించాయి.

టమాటాలను అధికంగా పండిచే రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి.. వాటిని రాయితీపై (Subsidised) శుక్రవారం (జులై 14,2023)నుంచి మార్కెట్‌లలో విక్రయిస్తోంది. ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi NCR), లక్నో, పట్నా సహా దేశంలోని పెద్ద నగరాల్లో అమ్మకం ప్రారంభించింది. కిలో రూ.90కు ఒక్కో వ్యక్తికి రెండు కిలోల చొప్పున రాయితీపై అందిస్తోంది. తాజాగా సేకరించిన టమాటాలను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), కర్ణాటక (Karnataka), మహారాష్ట్రల (Maharashtra) నుంచి ఢిల్లీ మార్కెట్లకు పెద్ద మొత్తంలో టమాటాలు చేరుకున్నాయి. కాగా అధికారులు టమాటాలో శుక్రవారం నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

Tomato Prices : విమానం టికెట్ కొంటే టమాటాల ఫ్రీ .. హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు, టమాటాలా మజాకానా..!

నోయిడాలోని రజినీ గంథ్ చౌక్ లోని NCCF కార్యాలయం వద్ద, గ్రేటర్ నోయిడా, ఇతర ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్లలో టమాటాలను అమ్మకానికి పెట్టారు. అలాగే లక్నో,కాన్పూర్, జైపూర్ వంటి నగరాల్లో కూడా టమాటాలను అమ్మనున్నారు. ఢిల్లీలోని 11 జిల్లాల్లో మొత్తం 20 మొబైల్ వ్యాన్లలో ఐదు కేంద్రాల్లో సబ్సిటీలపై టమాటాల విక్రయం ఈరోజు ప్రారంభించారు అధికారులు.

దీంట్లో భాగంగా మొదటిరోజు 17,000 కిలోల టమాలను విక్రయించేందుకు అందుబాటులో ఉంచామని ఎన్‌సీసీఎఫ్ ఛైర్మన్ విశాల్ సింగ్ తెలిపారు. ఒక్కొక్కరికి రెండు కిలోల చొప్పున మాత్రమే విక్రయిస్తామని స్పష్టంచేశారు. కిలో రూ.120 నుంచి రూ.130కు ధర పలుకుతున్న క్రమంలో కిలో రూ.90కే అమ్మనున్నామని ఎన్‌సీసీఎఫ్ ఎండీ అనిస్ జోసెఫ్ చంద్ర (NCCF Managing Director Anice Joseph Chandra)తెలిపారు. కాగా ఈ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందనివెల్లడించారు.

కాగా..ఉత్పత్తి ఎక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాలని నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెట్ ఫెడరేషన్ – నాఫెడ్, నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్‌లకు కేంద్రం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

టమాటా ధరలు భారీగా పెరిగిపోవటంతో అన్ని రాష్ట్రాల్లో కిలో టమాటా రూ. 150 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే రూ.250 కి కూడా అమ్మతున్న పరిస్థితి ఉంది. దీంతో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో చర్యలు చేపట్టి టమాటా పండిన రాష్ట్రాల నుంచి పంటను సేకరించి.. మిగిలిన రాష్ట్రాల్లో తక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించింది.

 

ట్రెండింగ్ వార్తలు