అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దుండగుల దాడి.. వీడియో పోస్ట్ చేసిన ఎంపీ

Asaduddin Owaisi: నేమ్ ప్లేటుపై అసదుద్దీన్ ఒవైసీ పేరు కనపడకుండా చేశారు.

Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఢిల్లీలోని అసదుద్దీన్ ఒవైసీ ఇంటి నేమ్‌ ప్లేటుతో పాటు గేటుపై నల్ల ఇంకును చల్లారు. నేమ్ ప్లేటుపై అసదుద్దీన్ ఒవైసీ పేరు కనపడకుండా చేశారు.

గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ‘భారత్ మాతా కీ జై’ అని ఉన్న కొన్ని పోస్టర్లను కూడా అతికించి వెళ్లారు. దీనిపై ఎక్స్ లో ఒవైసీ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

‘కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నల్ల సిరాతో నా ఇంటిపై దాడి చేశారు. ఢిల్లీలోని నా నివాసాన్ని లెక్కలేనన్ని సార్లు లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఢిల్లీ పోలీసుల ఎదుటే ఇటువంటి ఘటనలు ఎలా జరుగుతున్నాయని అడిగాను. దానికి అధికారులు నిస్సహాయత వ్యక్తం చేశారు. అమిత్ షా పర్యవేక్షణలోనే ఇటువంటివి జరుగుతున్నాయి.

ఓం బిర్లా.. దయచేసి ఎంపీల భద్రతకు హామీ ఉంటుందో లేదో చెప్పండి. ఇటువంటి దాడులు నన్ను భయపెట్టలేవు. ఇటువంటి సావర్కర్ తరహా పిరికిపంద చర్యలను మానుకోండి. నన్ను నేరుగా ఎదుర్కోండి. ఇంకు చల్లి, రాళ్లు రువ్వి.. ఆ తర్వాత పారిపోవద్దు’ అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

Also Read: ఈ అంపైర్‌కి ఏమైంది? షేక్‌హ్యాండ్ ఇవ్వూ.. అరె నిన్నే బుమ్రా అడుగుతున్నాడు..

ట్రెండింగ్ వార్తలు