ChatGPT App : ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త చాట్‌జీపీటీ యాప్.. వచ్చేవారమే లాంచ్.. గూగుల్ బార్డ్ పరిస్థితి ఏంటి?

ChatGPT App : ChatGPT యాప్ Android వెర్షన్‌ను లాంచ్ చేయడానికి OpenAI రెడీగా ఉంది. ఇప్పటికే Google Play స్టోర్‌లో లిస్టు అయింది. ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పుడే యాప్‌ను ముందస్తుగా ఆర్డర్ చేయవచ్చు,

ChatGPT app for Android launching next week, should Google Bard be worried

ChatGPT App : ఏఐ చాట్‌జీపీటీ యూజర్లకు అలర్ట్.. ఓపెన్ ఏఐ (OpenAI) ఆధారిత చాట్‌జీపీటీ (ChatGPT) ఆండ్రాయిడ్ వెర్షన్ అందుబాటులోకి రానుంది. iOS యూజర్ల కోసం ChatGPT యాప్‌ను లాంచ్ చేసిన తర్వాత OpenAI యాప్ Android వెర్షన్‌ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ యాప్ ఇప్పటికే (Google Play Store)లో లిస్టు అయింది. వచ్చే వారమే ChatGPT యాప్ అందుబాటులోకి వస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌లో ముందస్తు ఆర్డర్ చేయవచ్చని కంపెనీ ట్విట్టర్ ధృవీకరించింది.

వచ్చే వారమే ChatGPT ఆండ్రాయిడ్ వెర్షన్ లాంచ్ కానుందని కంపెనీ తెలిపింది. ఎప్పుడు లాంచ్ అనేది కంపెనీ కచ్చితమైన తేదీని పేర్కొనలేదు. కానీ, యాప్ లాంచ్ అయిన వెంటనే దాన్ని పొందడానికి గూగుల్ ప్లే స్టోర్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. తెలియని వారికి, ChatGPT అనేది మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదు. మీతో చాట్‌బాట్ సంభాషణలు చేయగలదు. మేలో iOS యూజర్లకు ChatGPT లాంచ్ అయినప్పటి నుంచి చాలా మంది Android వెర్షన్ యాప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also : JioBook Laptop Launch : జియోబుక్ కొత్త ల్యాప్‌టాప్ వచ్చేస్తోంది.. ఈ నెల 31నే లాంచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

చాట్‌బాట్ రాకతో ప్రపంచంలో తీవ్రపోటీ నెలకొంది. ఎందుకంటే.. గూగుల్ బార్డ్ (Google Bard AI) చాట్‌బాట్ ఆందోళనకు ఇదే కొంత కారణం ఉండవచ్చు. ChatGPT మాదరిగా కాకుండా బార్డ్‌లో ప్రత్యేక మొబైల్ యాప్‌లు లేవు. బదులుగా, వెబ్ ఆధారిత ఇంటర్‌ఫేస్‌పై ఆధారపడుతుంది. కానీ, ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు మరో ఆప్షన్ ఉంటుంది. గేమ్‌ను వేగవంతం చేసేందుకు బార్డ్‌పై కొంత ఒత్తిడి తీసుకురావచ్చు. మీరు ChatGPT Android యాప్ కోసం వేచి ఉండలేకపోతే.. ఇప్పటికే Microsoft Bing యాప్‌ని వినియోగించవచ్చు. బింగ్ ప్రోమెథియస్ మోడల్ GPT-4ని ఉపయోగించి ఫిబ్రవరి నుంచి Android, iOS రెండింటిలోనూ అందుబాటులో ఉంది.

ChatGPT app for Android launching next week, should Google Bard be worried

చాట్‌బాట్ పరిష్కారం కోసం చూస్తుంటే.. Bing తాత్కాలిక పరిష్కారం కావచ్చు. అయితే, చాట్‌జీపీటీ ఆండ్రాయిడ్ రిలీజ్ గమనించదగ్గ విషయం. సెన్సార్ టవర్, సిమిలార్‌వెబ్ నుంచి ఇటీవలి డేటా జూన్‌లో వెబ్ ట్రాఫిక్, యాప్ ఇన్‌స్టాలేషన్‌లలో క్షీణతను చూపించింది. అదనంగా, కొంతమంది యూజర్లు కొత్త వెర్షన్, GPT-4, నెమ్మదిగా ఉందని ఫిర్యాదు చేశారు. ChatGPT ఆధారిత సంస్థ OpenAI ఈ ఫిర్యాదులకు సమాధానమిచ్చింది. యాప్ పర్పార్మెన్స్ మెరుగుపరచడానికి నిరంతరం అప్‌డేట్‌లపై పని చేస్తున్నామని పేర్కొంది.

ఆండ్రాయిడ్ యూజర్లు త్వరలో చాట్‌జీపీటీని సౌలభ్యాన్ని ఆస్వాదించవచ్చు. ఈ కొత్త చేరికతో గూగుల్ బార్డ్ చాట్‌బాట్ కొంత పోటీని ఎదుర్కోవచ్చు. ChatGPT ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం ఎదురుచూసే బదులు Microsoft Bing వంటి ఇతర చాట్‌బాట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. OpenAI వేగంగా ఏవైనా సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ యాప్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి మరిన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్లు రాబోయే ChatGPT యాప్‌తో ఆసక్తికరమైన సంభాషణలు, మీ ప్రశ్నలకు సమాధానాలను పొందవచ్చు.

Read Also : Twitter Bird Logo : ట్విట్టర్ పిట్ట ఎగిరిపోనుంది.. కొత్త లోగో ఇదేనట.. అన్ని పక్షులకు బైబై అంటున్న మస్క్ మామ!

ట్రెండింగ్ వార్తలు