Chiranjeevi : ఆ ఒక్క విషయంలో నాకు చరణ్‌కి అసలు పోలిక ఉండదు.. చిరంజీవి!

కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతూ అందరూ పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీకి అయితే గత ఏడాది ఎంతో అమితమైన ఆనందాన్ని ఇచ్చింది అంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కాగా ఒక విషయంలో మాత్రం తనకి, చరణ్‌కి అసలు పోలిక ఉండదు అంటూ వ్యాఖ్యానించాడు చిరంజీవి.

Chiranjeevi : కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతూ అందరూ పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీకి అయితే గత ఏడాది ఎంతో అమితమైన ఆనందాన్ని ఇచ్చింది అంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. మెగాహీరోలు అంతా క్రిందటి సంవత్సరం అద్భుతమైన విజయాల్ని అందుకోవడం, ఉపాసన-రామ్ చరణ్‌లు అమ్మానాన్నలు కాబోతున్నారు అన్న శుభవార్తతో ఫుల్ హ్యాపీలో ఉన్నారు మెగా ఫ్యామిలీ.

Chiranjeevi : ఉపాసన తల్లి కాబోతుందని విని.. కన్నీళ్లు పెట్టుకున్నాము.. చిరంజీవి!

కాగా చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా సంక్రాంతికి విడుదలకు సిద్దమవుతుండడంతో ప్రమోషన్స్ మొదలు పెట్టాడు చిరంజీవి. ఈ క్రమంలోనే ఒక వార్త పత్రిక ఇంటర్వ్యూ ఇవ్వగా.. రామ్ చరణ్ గురించి కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక విషయంలో మాత్రం చరణ్‌కి, చిరంజీవికి అసలు పోలిక ఉండదు అంటూ తెలియజేశాడు.

“రామ్ చరణ్ కూడా నాకులా అందర్నీ తన వాళ్లే అనుకుంటాడు. అందర్నీ తన కుటుంబంలా భావించి మంచి చెడ్డలు చూసుకుంటాడు. అందుకు నాకు చాలా గర్వంగా ఉంటుంది. అయితే ఈ గుణాన్ని నేను ఓపెన్ గా చూపిస్తే, వాడు మాత్రం చాలా గోప్యంగా చూపిస్తాడు. ఈ ఒక్క విషయంలో నాకు చరణ్‌కి అసలు పోలిక ఉండదు” అంటూ తెలియజేశాడు.

ట్రెండింగ్ వార్తలు