Chiranjeevi : చిత్రపురి కాలనీ సామూహిక గృహ ప్రవేశం.. రిబ్బన్ కట్ చేసిన చిరంజీవి!

హైదరాబాద్ లో సినీ వర్కర్స్ కోసం కట్టిన చిత్రపురి కాలనీ ఎంఐజీ, హెచ్ఐజీ ప్లాట్ల సామూహిక గృహ ప్రవేశ మహోత్సవం కార్యక్రమం నేడు ఘనంగా జరుగుతుంది. దాదాపు 22 ఏళ్ళ సినీ కార్మికుల కల ఇవాళ నిజం కాబోతుండడంతో, చిత్రపురిలో ఆనందాల హరివిల్లు విరుస్తుంది. ఇక ఈ సామూహిక గృహ ప్రవేశాన్ని చిరంజీవి రిబ్బన్ కటింగ్ తో ప్రారంభించారు .

Chiranjeevi : హైదరాబాద్ లో సినీ వర్కర్స్ కోసం కట్టిన చిత్రపురి కాలనీ ఎంఐజీ, హెచ్ఐజీ ప్లాట్ల సామూహిక గృహ ప్రవేశ మహోత్సవం కార్యక్రమం నేడు ఘనంగా జరుగుతుంది. దాదాపు 22 ఏళ్ళ సినీ కార్మికుల కల ఇవాళ నిజం కాబోతుండడంతో, చిత్రపురిలో ఆనందాల హరివిల్లు విరుస్తుంది. ఆగిపోయింది, ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి అంటూ విమర్శలు ఎదురుకున్న ఈ చిత్రపురి కాలనీ నేడు ప్రజలకి అందుబాటులోకి రానుంది.

Vallabhaneni Janardhan : టాలీవుడ్‌లో మరో విషాదం.. గ్యాంగ్ లీడర్ నటుడు మృతి..

డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ ఎంఐజీ, హెచ్ఐజీ ప్లాట్ల సామూహిక గృహ ప్రవేశ మహోత్సవం కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, తమ్మారెడ్డి భరద్వాజ్, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మంత్రి సింగిరెడ్డి నిరంజన్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ సామూహిక గృహ ప్రవేశాన్ని చిరంజీవి రిబ్బన్ కటింగ్ తో ప్రారంభించారు .

ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. ‘డిసెంబర్ 29వ తారీఖునే ఈ ఈవెంట్ ని ఎందుకు పెట్టారని అందరికి ఒక చిన్న డౌట్ ఉంది. కరెక్ట్ గా 22 ఏళ్ళ క్రిందట ఇదే రోజు అప్పటి సినీ పెద్దలైన దాసరి నారాయణ గారు, రామానాయుడు గారు, రాఘవేంద్ర రావు గారు తొలి శంకుస్థాపన రాయిని వేశారు. అదే రోజున ఈ 1176 మంది మధ్యతరగతి కుటుంబాలకి గృహాలు అందజేస్తే చిత్రపురి కల నెరవేరునట్లు అని భావించి ఇవాళ పెట్టడం జరిగింది’ అంటూ తెలియజేశాడు.

ట్రెండింగ్ వార్తలు