Acharya: మెగా మేనియా.. రికార్డ్ ధరకు డబ్బింగ్ రైట్స్!

పాన్ ఇండియా సినిమాలే కాదు.. ఇప్పుడు ఉత్తరాదిన మన తెలుగు సినిమాలకు భారీ డిమాండ్ ఉంటుంది. మన స్టార్ హీరోల డబ్బింగ్ రైట్స్ కోసం ఇరవై కోట్లు చెల్లించేందుకు నార్త్ నిర్మాతలు ఏ మాత్రం వెనకాడడం లేదు. ఇక, మన మెగాస్టార్ సినిమా కోసం ఏకంగా రూ.26 కోట్లు చెల్లించి డబ్బింగ్ హక్కులు దక్కించుకున్నారు.

Acharya: పాన్ ఇండియా సినిమాలే కాదు.. ఇప్పుడు ఉత్తరాదిన మన తెలుగు సినిమాలకు భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే మన సినిమాల డబ్బింగ్ రైట్స్ కోసం అక్కడి నిర్మాతలు భారీ ధరలు చెల్లిస్తున్నారు. మన స్టార్ హీరోల డబ్బింగ్ రైట్స్ కోసం ఇరవై కోట్లు చెల్లించేందుకు నార్త్ నిర్మాతలు ఏ మాత్రం వెనకాడడం లేదు. ఇక, మన మెగాస్టార్ సినిమా కోసం ఏకంగా రూ.26 కోట్లు చెల్లించి డబ్బింగ్ హక్కులు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు డబ్బింగ్ రైట్స్ ధరలలో చిరంజీవి ఆచార్య సినిమానే టాప్ గా నిలిచింది.

మెగాస్టార్ చిరు – కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ – పూజ హెగ్డే కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా దక్షణాది బాషలలోనే కాకుండా హిందీలో కూడా విడుదల కానుంది. కాగా, ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడ ఏకంగా రూ.26 కోట్లకు దక్కించుకున్నారు. ఇప్పటి వరకూ పాన్ ఇండియా సినిమాలను మినహాయించి పవన్ కళ్యాణ్ – రానా సినిమా అయ్యముమ్ కోషియం రీమేక్ 23 కోట్ల రూపాయల డబ్బింగ్ రైట్స్ ధరతో టాప్ లిస్ట్ లో ఉండగా ఆచార్య ఇప్పుడు దాన్ని అధిగమించేసింది.

సాధారణంగా తెలుగు సినిమాలకు హిందీలో శాటిలైట్ హక్కులకు భారీ డిమాండ్ ఉంటుంది. టీవీల్లో వచ్చే మన సినిమాలకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతుంటారు. ఈ క్రమంలోనే మన సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టే నిర్మాతలు పోటీపడి మరీ అధిక ధరలు చెల్లిస్తున్నారు. ఆచార్యలో మెగాస్టార్ కు తోడు రామ్ చరణ్, పూజా హెగ్డే, సోనూసూద్ లాంటి ఉత్తరాదిన ఇప్పటికే స్ట్రైట్ సినిమాల ద్వారా పరిచయమున్న స్టార్స్ ఉండడం కూడా ఈ సినిమాకి కలిసి వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇక ఆచార్య సినిమా విడుదల తేదీపై రకరకాల ప్రచారం జరుగుతుండగా యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు