CM KCR : తెలంగాణలో మరో కొత్త పథకం, ఇక చేనేత కార్మికులకు కూడా

చేనేత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రైతు బీమా తరహాలో చేనేత బీమా పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. చేనేత కార్మికులకు కూడా రైతు బీమా తరహాలో బీమా వర్తింపజేస్తామని చెప్పారు. ఇందుకోసం

CM KCR New Scheme : చేనేత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రైతు బీమా తరహాలో చేనేత బీమా పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. చేనేత కార్మికులకు కూడా రైతు బీమా తరహాలో బీమా వర్తింపజేస్తామని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామని… దానికి సంబంధించిన కసరత్తు జరుగుతోందని తెలిపారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.

భవిష్యత్తులో దళితుల కోసం ప్రత్యేక బీమా సౌకార్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు కేసీఆర్. ఈ మేరకు దళిత సంక్షేమ శాఖ కసరత్తులు చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు చెప్పినట్లు వెల్లడించారు. ”రైతు సంక్షేమం కోసం రైతు బీమా పథకాన్ని అమలు చేయడానికి ఏడాది పట్టింది. 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేసి… అందులో రైతుల వివరాలు సేకరించి జాగ్రత్తగా దాన్ని అమలు చేయడం జరిగింది. ప్రస్తుతం చేనేత కార్మికుల బీమా సదుపాయం కోసం అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. దళిత సంక్షేమ శాఖ కూడా ఆ ఏర్పాట్లలో ఉండాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో చెప్పాం’ అని కేసీఆర్ తెలిపారు.

దళిత జాతి తరాలుగా దోపిడీ, వివక్షకు గురవుతోందని కేసీఆర్ అన్నారు. వాస్తవానికి దళితబంధు ఏడాదిన్నర ముందే మొదలుకావాల్సిందన్నారు. కరోనా వల్ల ఆలస్యమైందన్నారు. చాలామంది దళితులకు ఆస్తులు లేవన్న కేసీఆర్.. ఇప్పుడిప్పుడే వారికి విద్య అందుతోందన్నారు. ఆరు నూరైనా దళితబంధు పథకం ఆగదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఏడాదికి ఎన్ని లక్షల కుటుంబాలకు ఆ పథకం అందించాలనేది త్వరలోనే నిర్ణయిస్తామన్నారు.

తెలంగాణ ఒక ధనిక రాష్ట్రామని సీఎం కేసీఆర్ అన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. తెలంగాణకు కంపెనీలు వెల్లువలా వస్తున్నాయని వివరించారు. భవిష్యత్‌లో మరిన్ని పరిశ్రమలు వస్తాయన్నారు. మెరుగైన తలసరి ఆదాయాన్ని సాధించుకుంటున్నామని సీఎం గుర్తు చేశారు.

ట్రెండింగ్ వార్తలు