Bigg Boss 5 : స్టెప్పులతో దద్దరిల్లిన బిగ్‌బాస్‌ హౌస్

ఓట్లు అడగాలంటే సినిమా స్టార్లను అనుకరించే టాస్కు తో పాటు డ్యాన్స్ లు కూడా వెయ్యాలని చెప్పాడు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్స్ అంతా స్టార్స్ లా మారిపోయారు. సన్నీ.. బాలయ్యలాగా....

Bigg Boss 5 :  బిగ్ బాస్ చివరి దశకు రావడంతో రోజు రోజుకి టాస్కులతో మరింత ఆసక్తిగా మారుతుంది. హౌస్ లో ఇప్పుడు ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ పోటీ పడి మరీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ని చూపిస్తున్నారు. ఇక మొన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ఇమిటేటింగ్, సీన్స్ రీ క్రియేషన్స్ ఇవ్వగా నిన్నటి ఎపిసోడ్ లో ప్రేక్షకులను ఓట్లు అడగాలంటే సినిమా స్టార్లను అనుకరించే టాస్కు తో పాటు డ్యాన్స్ లు కూడా వెయ్యాలని చెప్పాడు బిగ్ బాస్.

Bigg Boss 5 : నువ్వు నాకు సిస్టర్ ఏంటి? బ్రో అని పిలవకు.. కాజల్ పై శ్రీరామ్ ఫైర్

దీంతో కంటెస్టెంట్స్ అంతా స్టార్స్ లా మారిపోయారు. సన్నీ.. బాలయ్యలాగా ఫ్యాక్షన్ గెటప్ వేసాడు. శ్రీరామ్‌.. చిరంజీవి లాగా ముఠా మేస్త్రి గెటప్ వేశాడు. కాజల్‌.. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి గెటప్ వేసింది. మానస్‌.. పవన్‌ కల్యాణ్‌ గెటప్, షణ్ను.. సూర్య గెటప్, సిరి.. జెనీలియాగా మారారు. వారు వేసిన పాత్రలకి న్యాయం చేస్తూ నటించారు. ఆ తర్వాత బిగ్ బాస్ ప్లే చేసిన సాంగ్స్ కి డ్యాన్సులు వేసి అదరగొట్టారు కంటెస్టెంట్స్.

Ram Charan : మరదలితో కలిసి స్టెప్పులేసిన మెగా పవర్ స్టార్

‘హ్యాపీ’ సినిమాలోని ‘ఒసా.. ఒసారే’ పాటకు సన్నీ, సిరి కలిసి డ్యాన్స్ వేశారు. కాజల్, శ్రీరామ్ కలిసి ‘హొయ్ రబ్బా… హొయ్ రబ్బా’ సాంగ్ కి డ్యాన్స్ వేశారు. మానస్, కాజల్ కలిసి ‘అబ్బనీ తియ్యని దెబ్బ’ సాంగ్ కి డ్యాన్స్ వేశారు. కాజల్, సన్నీ కలిసి ‘లక్స్ పాప… లక్స్ పాప’ సాంగ్ కి డ్యాన్స్ వేశారు. తర్వాత మానస్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో సాంగ్ కి డ్యాన్స్ చేశాడు. మరి కొన్ని పాటలకు కూడా డ్యాన్సులు చేశారు కంటెస్టెంట్స్. అప్పటిదాకా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్న కంటెస్టెంట్స్ ఈ ఎపిసోడ్ లో అంతా కలిసి ఎంజాయ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు