కరోనా సమయంలో జియో యూజర్లకు గుడ్ న్యూస్..

దేశం ప్రస్తుతం తీవ్రమైన కరోనా సంక్షోభంతో పోరాడుతోంది. ఇటువంటి సమయంలో దేశంలోని అతిపెద్ద మొబైల్ సేవా సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు అధ్భుతమైన ఆఫర్ అందించేందుకు ముందుకొచ్చింది. ప్రతి నెలా 300 నిమిషాల అవుట్‌గోయింగ్ కాల్స్‌ను వినియోగదారులకు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ Jio ఫోన్‌ల వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జియో ఫోన్‌లో కంపెనీ బై వన్ గెట్ వన్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.

ప్రతి భారతీయుడికి డిజిటల్ జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో జియోఫోన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించిన కంపెనీ, కోవిడ్ మహమ్మారి విస్తరించిన సమయంలో సంస్థ తన కస్టమర్లు కోసం.. ఫోన్‌లను రీఛార్జ్ చేయలేకపోతున్న ప్రజలకు ఈ పథకం ప్రయోజనం చేకూరుస్తుందని కంపెనీ చెబుతోంది.

రిలయన్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేసే జియో 300 నిమిషాల ఉచిత అవుట్‌ గోయింగ్ కాల్స్ అందిస్తుంది. మహమ్మారి కారణంగా రీఛార్జ్ చేయలేకపోయిన వినియోగదారులకు కరోనా కాలానికి 300 నిమిషాలు (రోజుకు 10 నిమిషాలు) ఉచితంగా ఇస్తుంది.

జియోఫోన్ వినియోగదారు రీఛార్జ్ చేసిన ప్రతి ప్లాన్.. అదే విలువతో అదనపు రీఛార్జ్ ప్లాన్‌ను ఉచితంగా పొందుతారు. ఉదాహరణకు, ₹ 75 ప్లాన్‌తో రీఛార్జ్ చేసే జియోఫోన్ కష్టమర్లకు అదనపు ₹75 ప్లాన్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తారు.

ట్రెండింగ్ వార్తలు