Covid-19: స్టూడెంట్స్ లంచ్ షేర్ చేసుకోవద్దు: ఢిల్లీ ప్రభుత్వం

కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్కూల్స్‌లో స్టూడెంట్స్ లంచ్ షేర్ చేసుకోవద్దని సూచించింది.

Covid-19: కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్‌ను అదుపులోకి‌ తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఇప్పటికే గుంపులుగా ఉండటాన్ని నిషేధించింది. మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి చేసింది. అయితే, శుక్రవారం నుంచి మరో కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. స్కూల్స్‌లో స్టూడెంట్స్ లంచ్ షేర్ చేసుకోవద్దని సూచించింది. సాధారణంగా స్కూల్స్‌లో లంచ్ చేసేటప్పుడు విద్యార్థులు ఒకరి ఫుడ్ ఐటమ్స్, మరొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు.

IIT-Madras Covid-19 : ఐఐటీ మద్రాసులో కరోనా కలకలం.. 19మంది విద్యార్థులకు పాజిటివ్..

దీనితోపాటు బుక్స్, పెన్స్ వంటివి కూడా షేర్ చేసుకుంటారు. దీనివల్ల కరోనా వ్యాపించే అవకాశం ఉంది. అందుకే దీన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం స్కూల్ యాజమాన్యాలకు సూచించింది. మరోవైపు విద్యార్థులు స్కూల్‌లోకి అడుగుపెట్టేముందే ఎంట్రీ దగ్గర కచ్చితంగా టెంపరేచర్ చెకింగ్ వంటివి చేయాలని చెప్పింది. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వాళ్లను స్కూల్‌కు అనుమతించొద్దని ఆదేశించింది. పేరెంట్స్‌తో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి, విద్యార్థుల విషయంలో తగిన జాగ్రత్తలు చెప్పాలని సూచించింది.

ట్రెండింగ్ వార్తలు