WhatsApp AI Profile Photos : వాట్సాప్‌లో త్వరలో ఏఐ ఆధారిత ప్రొఫైల్ ఫొటోలను క్రియేట్ చేయొచ్చు!

ఈ ఏఐ ఆధారిత ఫీచర్ సాయంతో ఆన్‌లైన్‌లో ఒరిజినల్ ఫొటోలను షేర్ చేయడం వల్ల కలిగే నష్టాలను తగ్గిస్తుందని నివేదిక తెలిపింది. ప్రైవసీపరంగా యూజర్లు ఈ ఫీచర్ నుంచి ప్రయోజనం పొందవచ్చు.

WhatsApp AI-Based Profile Photos : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో ఏఐ ఆధారిత ప్రొఫైల్ ఫొటోలను క్రియేట్ చేయడానికి యూజర్లను అనుమతించే కొత్త ఫీచర్‌ను లాంచ్ చేయనుంది. ఇటీవలి ఏఐ స్టిక్కర్‌లకు అనుగుణంగా ఈ కొత్త ఫీచర్ పనిచేయనుంది. అంతేకాదు.. యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ సరికొత్త ఏఐ ఫీచర్ అందించనుంది.

Read Also : Apple iPhone 14 Series : ఆపిల్ ఫోన్ కావాలా? ఒకే ధరకు రెండు ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు.. ఏ ఐఫోన్ కొంటే బెటర్ అంటే?

వాట్సాప్ నివేదిక (WABetaInfo) ప్రకారం.. మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్ అభివృద్ధి చేస్తోంది. వినియోగదారులు వారి వ్యక్తిత్వం, ఆసక్తులు లేదా మానసిక స్థితికి అద్దం పట్టే ఫొటోలను రూపొందించడానికి ఏఐని అనుమతించనుంది.

ఇందులో ఫొటో వివరణ లేదా ప్రాంప్ట్ అందించడం ద్వారా త్వరలో ప్రత్యేకమైన ప్రొఫైల్ ఫొటోలను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ యూజర్ ఇంటరాక్షన్‌ను ఎలివేట్ చేయడానికి మెరుగైన ఎక్స్‌పీరియన్స్ అందించడానికి రూపొందించింది. ఏఐ రూపొందించిన ఫొటోలను ఎనేబుల్ చేయడం ద్వారా వాట్సాప్ తమ యూజర్లను వారి ఒరిజినల్ ఫొటోలను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా మరింత క్రియేటివిటీగా అందించనుంది. యూజర్ ప్రొఫైల్ ఫొటోలకు కస్టమైజడ్ ఫిల్టర్ యాడ్ చేయడమే కాకుండా ప్రైవసీని కూడా మరింత పెంచుతుంది.

ప్రైవసీపరంగా అనేక ప్రయోజనాలు :
ఈ ఏఐ ఆధారిత ఫీచర్ సాయంతో ఆన్‌లైన్‌లో ఒరిజినల్ ఫొటోలను షేర్ చేయడం వల్ల కలిగే నష్టాలను తగ్గిస్తుందని నివేదిక తెలిపింది. ప్రైవసీపరంగా యూజర్లు ఈ ఫీచర్ నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఎందుకంటే.. ఒరిజనల్ ఫొటోలను షేరింగ్ చేసేందుకు ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. తద్వారా అనధికార షేరింగ్ తగ్గిస్తుంది. ప్రొఫైల్ ఫోటోల స్క్రీన్‌షాట్‌లను నిరోధించే, యూజర్ ప్రైవసీని బలోపేతం చేయనుంది. ఈ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్‌లో ఉన్నప్పటికీ, యాప్ ఫ్యూచర్ అప్‌డేట్‌లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

అంతేకాకుండా, యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా చదవని మెసేజ్ కౌంట్‌ను ఆటోమేటిక్‌గా క్లియర్ చేసే ఆప్షన్‌ను వాట్సాప్ యూజర్లు ఇవ్వవచ్చని ఇటీవలే తెలిపింది. యాప్‌ని ఓపెన్ చేసిన ప్రతిసారి యూజర్లు నోటిఫికేషన్ కౌంట్ రీసెట్ చేయగలరు. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం ద్వారా వినియోగదారులు ప్రతి యాప్ లాంచ్‌తో కొత్తగా ప్రారంభించవచ్చు. స్టోర్ అయిన రీడన్ చేయనిమెసేజ్ కౌంట్ విషయంలో గందరగోళాన్ని తగ్గిస్తుంది. యూజర్లు వాట్సాప్‌ని ఓపెన్ ప్రతిసారీ ఇప్పటికే చదవని మెసేజ్ నోటిఫికేషన్‌లు సున్నాకి రీసెట్ అవుతాయి.

Read Also : Poco F6 5G Launch : పవర్‌పుల్ ప్రాసెసర్‌, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పోకో F6 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్లు వివరాలివే

ట్రెండింగ్ వార్తలు