తెలంగాణలో ఎక్కడాలేని ఫ్యాక్షన్ సంస్కృతి ఇక్కడ నెలకొంది: కేటీఆర్

రాజకీయ హత్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని అన్నారు.

తెలంగాణలో ఎక్కడలేని ఫ్యాక్షన్ సంస్కృతి కొల్లాపూర్‌లో నెలకొందని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

తెలంగాణలో ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తున్నారని చెప్పారు. 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఇలాంటి హత్యలు ఎన్నడూ జరగలేదని అన్నారు. తాము అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ఉండేదా అని నిలదీశారు. కొల్లాపూర్ ప్రాంతాన్ని కల్లోళ్ల ప్రాంతంగా సమస్యత్మక ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పేరుకేమో ప్రజాపాలన చేస్తున్నదేమో ప్రతికరణ పాలన అని విమర్శించారు. రాజకీయ హత్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని అన్నారు. కొల్లాపూర్ లో ఫ్యాక్షన్ సంస్కృతి నెలకొందని చెప్పారు. కొల్లాపూర్‌లో జరుగుతున్న వరుస హత్యల మీద జ్యుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని అన్నారు.

అసత్య ప్రచారాలకు కొడాలి నాని చెక్.. ఇదిగో వీడియో

ట్రెండింగ్ వార్తలు